China-Pakistan Economic Corridor: భారత్ అభ్యంతరాలు చెబుతున్నా.. సీపీఈసీ ప్రాజెక్టులో అఫ్గాన్‌ను చేర్చేందుకు పాక్-చైనా కుయుక్తులు

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో మూడవ దేశాన్ని చేర్చనున్నారు. ఈ మేరకు చైనా-పాక్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీపీఈసీ ప్రాజెక్టులో తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్‌ను చేర్చాలని చైనా-పాక్ భావిస్తున్నాయి. సీపీఈసీ ప్రాజెక్టులో ఇతర దేశాలను కూడా భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్న చైనా-పాక్ పై భారత్ ఇటీవల మండిపడిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధ చర్యలకు దిగుతున్నారని, ఇది అంగీకారయోగ్యం కాదని భారత్ ఇప్పటికే ప్రకటన చేసింది.

China-Pakistan Economic Corridor: భారత్ అభ్యంతరాలు చెబుతున్నా.. సీపీఈసీ ప్రాజెక్టులో అఫ్గాన్‌ను చేర్చేందుకు పాక్-చైనా కుయుక్తులు

China military outposts in Pakistan

Updated On : August 15, 2022 / 4:31 PM IST

China-Pakistan Economic Corridor: చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో మూడవ దేశాన్ని చేర్చనున్నారు. ఈ మేరకు చైనా-పాక్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీపీఈసీ ప్రాజెక్టులో తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్‌ను చేర్చాలని చైనా-పాక్ భావిస్తున్నాయి. సీపీఈసీ ప్రాజెక్టులో ఇతర దేశాలను కూడా భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్న చైనా-పాక్ పై భారత్ ఇటీవల మండిపడిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధ చర్యలకు దిగుతున్నారని, ఇది అంగీకారయోగ్యం కాదని భారత్ ఇప్పటికే ప్రకటన చేసింది.

ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామైతే భారత దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. సీపీఈసీ ప్రాజెక్ట్ పీవోకే మీదుగా వెళ్తున్న క్రమంలో భారత్ అభ్యంతరాలు తెలుపుతోంది. ఒకవేళ అఫ్గానిస్థాన్ సీపీఈసీ ప్రాజెక్టులో చేరితో ప్రపంచ సమాజం ఆ దేశాన్ని పూర్తిగా ఒంటరిని చేసే ప్రమాదం ఉంది. తాజాగా, సీపీఈసీ గురించి జరిగిన సమావేశంలో పాక్ ఓ ప్రతిపాదన తెచ్చింది. తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గాన్ ను ఈ ప్రాజెక్టులో చేర్చుకోవాలని చెప్పింది.

ఇందులో చేరితే ఎగుమతులు, దిగుమతులకు అఫ్గాన్ కు లాభదాయకమని చెప్పుకొచ్చింది. అయితే, దీని వెనుకాల పాక్ ఉద్దేశం మరొకటి ఉందని, చైనా మద్దతుతో అఫ్గాన్ పై ఆర్థిక పరంగా ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటోందని అఫ్గాన్ లోని పలువురు నిపుణులు అంటున్నారు. తాలిబన్ల పాలనలో అప్గాన్ వెళ్ళిన నేపథ్యంలో ఆ దేశానికి ప్రపంచం నుంచి సాయం అందట్లేదు. దీంతో ఆ దేశం సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ నేపథ్యంలో దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని, సీపీఈసీ ప్రాజెక్టులో అఫ్గాన్ ను చేర్చే ప్రయత్నాలు చేయాలని పాక్-చైనా భావిస్తున్నాయి.

China-Taiwan conflict: తైవాన్ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతాం.. చైనా ప్రకటన