Emotional Tribute to Late Wife: అమ్మతనానికి గుర్తుగా.. అమ్మ జ్ఞాపకంగా ఫొటోషూట్
మరికొన్ని రోజుల్లో బిడ్డ డెలివరీ అవుతుందనుకుంటున్న తరుణంలో కార్ డ్రైవర్ నిర్లక్ష్యం కుటుంబంలో విషాదాన్ని నింపింది. వాకింగ్‌కు వెళ్లి.........

Tribute To Late Wife (1)
Emotional Tribute to Late Wife: పాప పుట్టాక.. గర్భిణీగా ఉన్నప్పటి గురుతులు చూపించి మురిసిపోదామని తీసుకున్న ఫొటో షూట్ ఒక జ్ఞాపకమైపోయింది. నవ మోసాలు మోసిన తల్లి నిల్చొన్న చోటే ఫొటోలు దిగిన ఆ చిన్నారిని చూపిస్తూ తండ్రి ఇలా సరిపెట్టుకుంటున్నాడు. భార్య అర్థాంతరంగా లోకాన్ని వీడితే.. ఆ బాధ మనసుకు గుచ్చుకున్న ముల్లులా పదేపదే వేధిస్తూనే ఉంటుంది. ఆ గాయాన్ని దిగమింగుకునే ప్రయత్నంగా జేమ్స్ అల్వారెజ్ తన బేబీ ఫస్ట్ బర్త్ డే ఫొటోషూట్ ఇది.
జేమ్స్ అల్వారెజ్ భార్య యెసేనియా గర్భం దాల్చింది. మరికొన్ని రోజుల్లో బిడ్డ డెలివరీ అవుతుందనుకుంటున్న తరుణంలో కార్ డ్రైవర్ నిర్లక్ష్యం కుటుంబంలో విషాదాన్ని నింపింది. వాకింగ్‌కు వెళ్లిన నిండు గర్భిణి యెసేనియా ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదృష్టవశాత్తు సకాలంలో సిజేరియన్ జరగడంతో వైద్యులు గర్భంలోని శిశువును కాపాడగలిగారు.
కనుమూసినా అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాపే అడలిన్. తమ ఇంట అడుగుపెట్టిన అదృష్టం.. మొదటి పుట్టిన రోజుకు తన భార్యకు ఫోటో షూట్ తో నివాళి అర్పించారు. మెటర్నిటీ ఫోటోషూట్ చేసుకున్న ప్రదేశంలోనే, తల్లి ధరించిన పింక్ రంగు దుస్తుల్లో, చిన్నారితో కలిసి అదే ఫోజులతో ఫోటోలో తీయించుకుని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘అడలిన్, మీ మమ్మీ ఇపుడు ఉండి ఉంటే చాలా సంతోషించేది. మొదటి పుట్టినరోజు వేడుకకు ఎంతో సంబరపడేది’ అంటూ జేమ్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘గులాబీ రంగు దుస్తుల్లో.. ఇక్కడే మెటర్నటీ షూట్ చేసుకున్నాం.. మళ్లీ అదే ప్లేస్‌లో.. తను లేకపోయినా.. అచ్చం అలాగే చేయడానికి ప్రయత్నించాం. నిజంగా అద్భుతంగా ఉన్నాయంటూ జేమ్స్ భార్యను గుర్తు చేసుకున్నారు. అడలిన్కు ఉత్తమ తండ్రిగా ఉండటానికి ప్రయత్నిస్తూ.. భార్య గర్వపడేలా ఉంటానని హామీ ఇచ్చారు.
పింక్ దుస్తుల్లో ముద్దులొలికే ఆ చిన్నారి ఫోటోలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మీ భార్య తప్పకుండా గర్వంగా ఫీల్ అవుతుందంటూ జేమ్స్‌కు నెటిజన్లు అభినందనలు తెలిపారు.