Turkish : మాయలో పడకుండా..పెద్ద ఐస్ క్రీంతో పారిపోయాడు, వీడియో వైరల్

Turkish ఐస్ క్రీం చాలా ఫేమస్. అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. కస్టమర్లతో ఐస్ క్రీం అందించే వారు చిలిపిగా..ఆటపట్టిస్తుంటారు.

Turkish : మాయలో పడకుండా..పెద్ద ఐస్ క్రీంతో పారిపోయాడు, వీడియో వైరల్

Ice Cream

Updated On : November 12, 2021 / 11:19 AM IST

Turkish Ice Cream : ఐస్ క్రీముల్లో చాలా రకాలుంటాయనే సంగతి తెలిసిందే. కానీ.. Turkish ఐస్ క్రీం చాలా ఫేమస్. అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. కస్టమర్లతో ఐస్ క్రీం అందించే వారు చిలిపిగా..ఆటపట్టిస్తుంటారు. ఓ పెద్ద సీకులాంటిది తీసుకుని..ఐస్ క్రీం కలిపి..కోన్ లో పెడుతారు. అది తీసుకోవడానికి ప్రయత్నంచే కస్టమర్ విఫలమౌతుంటాడు. అటూ..ఇటూ తిప్పుతూ..ఐస్ క్రీం దొరకకుండా..చేస్తుంటారు.

Read More : COVID-19 Guidelines: కేంద్రం కొత్త కోవిడ్ మార్గదర్శకాలు.. ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టెస్ట్ అక్కర్లేదు

దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ఈ వీడియోలు నవ్వులు తెప్పిస్తుంటాయి. అలాగే..జరిగింది. కానీ వచ్చిన కస్టమర్ మాత్రం పెద్ద ఐస్ క్రీంతో పారిపోతాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి లుంగీ కట్టుకుని ఓ ఐస్ క్రీం స్టాల్ వద్ద నిలబడుతాడు. అక్కడున్న వారు ఎలా ఆటపట్టిస్తారోనని చూడసాగారు. ఐస్ క్రీం విక్రయించే వ్యక్తి కోన్ అతడి చేతిలో పెడుతాడు. అనంతరం ఓ పెద్ద సీకు తీసుకుని ఐస్ క్రీం కలుపుతాడు. అనంతరం ఓ లావుగా ఉన్న ఐస్ క్రీం వస్తుంది.

Read More : Husband Kills His Wife : సాక్ష్యం చెప్పిన కూతురు..తండ్రికి జీవిత ఖైదు వేసిన కోర్టు

దీనిని కోన్ లో పెట్టడానికి ప్రయత్నించగా..ఆ వ్యక్తి అమాతం తీసుకుని పారిపోతాడు. అక్కడున్న వారు నవ్వుతూ..చప్పట్లు కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. Spot News దీనికి సంబంధించిన వీడియో యూ ట్యూబ్ లో పోస్టు చేసింది. చాలా మంది నెటిజన్లు దీనిని వీక్షించారు.