COVID-19 Guidelines: కేంద్రం కొత్త కోవిడ్ మార్గదర్శకాలు.. ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టెస్ట్ అక్కర్లేదు

అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం కొత్త కోవిడ్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది.

COVID-19 Guidelines: కేంద్రం కొత్త కోవిడ్ మార్గదర్శకాలు.. ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టెస్ట్ అక్కర్లేదు

Arrivals

COVID-19 Guidelines: అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం కొత్త కోవిడ్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది. భారత్‌కు వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణానికి ముందు లేదా భారత్‌ చేరుకున్నాక కరోనా పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

దేశంలోకి వచ్చాక హోం క్వారంటైన్‌ సమయంలో కరోనా లక్షణాలు వెలుగుచూస్తే చిన్నారులకు పరీక్షలు చేయించాలని సూచించింది. పాజిటివ్‌ అని వెల్లడైతే.. ప్రస్తుతం అమల్లో ఉన్న విధివిధానాల ప్రకారం చికిత్స చేయించాలని చెబుతుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అంతర్జాతీయ ప్రయాణికులపై ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి.

Husband Kills His Wife : సాక్ష్యం చెప్పిన కూతురు..తండ్రికి జీవిత ఖైదు వేసిన కోర్టు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదిత కొవిడ్‌-19 వ్యాక్సిన్ల విషయంలో భారత్‌ పరస్పర సర్దుబాట్లు చేసుకున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని 15 రోజులు గడిస్తే వారు విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇస్తారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే క్వారంటైన్‌ అవసరం లేదు. దేశంలోకి ప్రవేశించిన తర్వాత 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవల్సి ఉంటుంది.

Covid Cases : భారత్‌లో నిన్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ స్టేటస్ ఇదీ

వ్యాక్సిన్ తీసుకోని, ఒక డోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్‌లు చేయించుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్లి ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఎనిమిదో రోజు మళ్లీ కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలి. రెండు పరీక్షల్లో నెగెటివ్‌ వస్తే మరో వారం రోజులు ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త నిబంధనల్లో తెలిపింది.