నిద్రపోతూ ఎయిర్ పాడ్ మింగేశాడు.. లోపలికి వెళ్లి కూడా పనిచేస్తూనే ఉంది

నిద్రపోతూ ఎయిర్ పాడ్ మింగేశాడు.. లోపలికి వెళ్లి కూడా పనిచేస్తూనే ఉంది

Airpod: బూస్టన్ లోని బ్రాడ్ గాతియర్ అనే వ్యక్తి ఇయర్ ఫోన్స్ మింగేశాడు. నిద్రపోతుండగా మింగేసినట్లు అది బయటకు తీసిన తర్వాత హెల్త్ కేర్ వర్కర్లు చెబుతున్నారు. అందిన వివరాల ప్రకారం.. నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు ఉన్న బ్రాడ్.. నీటిని గొంతులో పోసుకున్నాడు. ఎంతసేపటికి నీరు లోపలికి వెళ్లలేదు.

అదే సమయంలో వైర్ లెస్ ఇయర్ బర్డ్స్ మిస్ అయినట్లు గుర్తించాడు గాతియర్. నిద్రపోవక ముందే వాటిని చూసినట్లు గుర్తు చేసుకున్నాడు. అతని కొడుకు సలహా మేరకు ఎక్స్ రే తీయించుకునేందుకు ఎమర్జెన్సీ క్లినిక్ కు వెళ్లాడు. అందులో ఏదో చిన్న ప్లాస్టిక్ డివైజ్ కడుపులో ఉన్నట్లు తెలిసింది.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన గాతియర్ అనుభవాన్ని పంచుకుంటూ.. పడుకునే ముందు హెడ్ ఫోన్స్ పెట్టుకోవద్దని సూచిస్తున్నాడు.

తైవాన్ లోనూ ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. అనుకోకుండా మింగేసిన ఎయిర్ పాడ్ కడుపులోకి వెళ్లినా కూడా పనిచేస్తూనే ఉంది. హెడ్ ఫోన్ పెట్టుకుని నిద్రపోతున్న వ్యక్తి లేచేసరికి ఒకటి కనిపించకుండా పోయింది. కావోసూయింగ్ హాస్పిటల్ వైద్యులు టెస్టులు చేసి జీర్ణ వ్యవస్థ వద్ద అది ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ఎటువంటి సర్జరీ లేకుండానే రెండో రోజు అది వచ్చేసిందని.. ఆ తర్వాత దానిని కడిగి ఎండబెట్టేసరికి యథావిధిగా పనిచేయడం మొదలుపెట్టిందని ఆ వ్యక్తి అంటున్నాడు.