Men Climb Drainpipe: వంద అడుగుల డ్రైనేజీ పైపు ఎక్కి అగ్నిప్రమాదం నుంచి పిల్లలను కాపాడిన వ్యక్తి

అపార్ట్‌మెంట్లోని టాప్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ మంటల్లో చిన్న పిల్లలు ఇరుక్కుపోయారు. వారిని కాపాడటానికి ఓ వ్యక్తి.. 30 మీటర్ల డ్రైనేజి పైపు ఎక్కేశాడు.

Men Climb Drainpipe: వంద అడుగుల డ్రైనేజీ పైపు ఎక్కి అగ్నిప్రమాదం నుంచి పిల్లలను కాపాడిన వ్యక్తి

Men Climb Drainpipe

Men Climb Drainpipe: అపార్ట్‌మెంట్లోని టాప్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ మంటల్లో చిన్న పిల్లలు ఇరుక్కుపోయారు. వారిని కాపాడటానికి ఓ వ్యక్తి.. 30 మీటర్ల డ్రైనేజి పైపు ఎక్కేశాడు. రష్యాలోని కొస్త్రామాలో జరిగిన ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.

అంత ఎత్తులోకి ఎక్కి పాపను కాపాడిన వ్యక్తి.. ఒక చేత్తో పాపను తీసుకుని డ్రైన్ పైప్ సాయంతో కింద ఉన్న మరో వ్యక్తి ఇచ్చుకుంటూ ఎట్టకేలకు ఆ తల్లి దగ్గరకు చేర్చారు. అదే తరహాలో మూడో ఫ్లోర్ లో ఉన్న మరో పాపను కాపాడారు. ఈ ఘటన జరిగిన కాసేపటికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు వచ్చి మంటలను అదుపు చేశారు.

అలా ముగ్గురు పిల్లలను కాపాడిన వ్యక్తి హీరోయిజాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ లో ముగ్గురు పిల్లలను.. అర్జెంట్ గా జరగాల్సిన రియల్ రెస్క్యూ ఆపరేషన్ చేసి సురక్షితంగా కిందకు చేర్చగలిగారనే క్యాప్షన్ తో వీడియో పోస్టు చేశారు.

40సెకన్ల పాటు నిడివి ఉన్న ఈ వీడియోకు 39వేల వ్యూస్ వచ్చాయి. మంచి మనుషులు కలిస్తేనే అద్భుతాలు జరుగుతాయంటూ ఒక ట్విట్టర్ యూజర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.