Girl Friend Cheating: ప్రేయసి తల్లికి కిడ్నీ ఇచ్చాడు.. ప్రియుడికి హ్యాండిచ్చింది

ప్రేమ పేరుతో జరిగే త్యాగాలు చూశాం, మోసాలు విన్నాం. కానీ, కిడ్నీ కోసం ప్రేమను వాడుకోవడం ఇదే తొలిసారేమో.. అదృష్టవశాత్తు కిడ్నీ పోయినా మోసం తెలిసి తట్టుకోగలిగాడా వ్యక్తి.

Girl Friend Cheating: ప్రేయసి తల్లికి కిడ్నీ ఇచ్చాడు.. ప్రియుడికి హ్యాండిచ్చింది

Girl Friend Cheating

Updated On : January 20, 2022 / 7:53 AM IST

Girl Friend Cheating: ప్రేమ పేరుతో జరిగే త్యాగాలు చూశాం, మోసాలు విన్నాం. కానీ, కిడ్నీ కోసం ప్రేమను వాడుకోవడం ఇదే తొలిసారేమో.. అదృష్టవశాత్తు కిడ్నీ పోయినా మోసం తెలిసి తట్టుకోగలిగాడా వ్యక్తి.

‘టీచర్ గా పనిచేస్తున్న మార్టినెజ్ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని టిక్ టాక్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మెక్సికోకు చెందిన ఉజీల్ మార్టినెజ్ అనే వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ తల్లికి కిడ్నీ డొనేట్ చేశాడు. అవయవదానం చేసి ప్రేయసి తల్లిని అయితే కాపాడుకోగలిగా. హీరోని అనుకున్నా. కానీ, ఆలోచించలేకపోయా’

‘కొద్ది వారాలు మాత్రమే గడిచిన మా రిలేషన్ కిడ్నీ డొనేషన్ అయిన కొద్ది కాలానికే బ్రేకప్ అయిపోయింది. ఒక నెల తర్వాతే వేరొక వ్యక్తిని పెళ్లాడింది’ ఇలా చెప్పిన వీడియోను టిక్ టాక్ లో పోస్టు చేశాడా వ్యక్తి.

ఇది కూడా చదవండి : ప్రముఖ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీసులకి ఫిర్యాదు..

అలా దాదాపు 14మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది ఆ వీడియో. కామెంట్లలో అతనికి ఓదార్పు కూడా అంతే రేంజ్ లో వస్తుందిలెండి.