చెట్లకు కాయని మామిడి పండ్లు : వెరీ టేస్టీ..వెరీ కాస్ట్‌లీ

  • Published By: veegamteam ,Published On : February 28, 2019 / 07:36 AM IST
చెట్లకు కాయని మామిడి పండ్లు : వెరీ టేస్టీ..వెరీ కాస్ట్‌లీ

హైదరాబాద్ : మామిడి పండ్లు ఎలా కాస్తాయి..ఏంటి పిచ్చి ప్రశ్న చెట్లకు కాస్తామని మాకు తెలీదా అంటారు కదూ..కానీ ఈ మామిడి పండ్లు మాత్రం చెట్లకు కాయవు..సరికదా..ఇవి చాలా చాలా కాస్ట్ కూడా. ఈ మామిడి వెరీ వెరీ డిఫరెంట్. ఇవి కేవలం చిన్న చిన్న కుండీల్లో మాత్రమే పెరుగుతాయి. వీటిని మామిడి చెట్టు అనటం కంటే మామిడి మొక్కలు అనడం బెటర్. ఎందుకంటే వీటిని చూసేందుకు సాధారణ మొక్కల్లాగానే ఉంటాయి. పండ్లు మాత్రం భళా అనిపిస్తాయి.

పెద్ద పెద్ద చెట్లకు మామిడి కాయలు కాస్తాయని అందరీకి తెలుసు..కానీ చిన్న చిన్న కుండీల్లో ఉండే చిన్నపాటి మొక్కలకు పెద్ద పెద్ద మామిడి పండ్లు కాస్తున్నాయి. మరి ఆ విశేషాలేమిటో  తెలుసుకుందాం..జపాన్‌లోని మియజాకీలో ఈ మామిడి పండ్లను ఉత్పత్తి చేసే వీటిని ‘మియజాకీ’మామిడి పండ్లని అంటారు. వీటిని  రెడ్ మ్యాంగో, ఎగ్ ఆఫ్ సన్ అనే పేర్లతోనూ పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన పండ్లగా పేరొందిన ఈ మామిడి పండ్లను సాదాసీదాగా పెంచరు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. 

  • ఒక్కో మామిడి పండు బరువు 700 గ్రాములు 
  • ఒక్క మామిడి పండు రేటు రూ.5 వేలు. 
  • మామూలు మామిడి పండ్ల కంటే 15 రెట్లు తియ్యగా ఉంటాయి  

ఈ మామిడి మొక్కలను చెట్లగా ఎదగనివ్వరు. వాటి కొమ్మలను కత్తిరిం చేస్తు..మొక్కలుగా పెంచుతారు. కొత్త కొమ్మలకు వచ్చే పూత ద్వారా కాయలొస్తాయి. అందుకే గాలికి పూత రాలిపోకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ మొక్కలకు ఉండే కాయలను కొయ్యరు. మొక్కకే పండేదాకా వెయిట్ చేస్తారు. పండిన తరువాత రాలిపోకుండా..నెట్ కడతారు. కాయలు ఎదిగిన మచ్చలు, గీతలు పడకుండా కవర్లు చుడతారు. వీటికి  ఐరోపా దేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. వీటిని బహుమతులుగా (కాస్ట్లీ) కూడా అందిస్తుంటారు. ఇన్ని విశేషాలు చూసిన తరువాత మీకూ ఈ పండ్లను రుచి చూడాలని ఉందా? అయితే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. త్వరలో వీటిని భారత మార్కెట్లో విక్రయించే యోచనలో ఉన్నారు. అప్పుడు మాత్రం కాస్ట్ గురించి ఆలోచించకుండా కొని టేస్ట్ చేయండి..