Nayera Ashraf Murder Case: ఆ ఉన్మాదిని ‘ఉరి’ తీయటం దేశమంతా చూడాలి..మరణశిక్ష టీవీల్లో లైవ్ టెలీకాస్ట్ చేయాలి..

నేరం చేయాలంటేనే భయపడేలా భావితరాలకు గట్టి సందేశం ఇవ్వాలని ఈజిప్ట్‌ కోర్టు అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. తోటి విద్యార్ధినిని అత్యంత పాశవికంగా హత్య చేసిన కరడు కట్టిన నేరస్థుడికి మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఈజిప్ట్‌ పార్లమెంట్‌కు లేఖ రాసింది.

Nayera Ashraf Murder Case : మరణశిక్షలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. నేరాల తీవ్రత ఎలా ఉన్నా..భారతదేశంలో మరణశిక్ష అంటే ‘ఉరి’వేసి అమలు చేస్తారు. అమెరికాలో 67 ఏళ్ల తరువాత ఓమహిళకు మరణశిక్షు ఓ విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపారు. సౌదీ అరేబియా ప్రభుత్వం గత మార్చి (2022)లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది. ఆధునిక చరిత్రలో ఒకేరోజు అత్యధిక సంఖ్యలో వ్యక్తులకు ఏకంగా మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి.

ఇదిలా ఉంటే..యువతుల జీవితాలను చిదిమేయాలని ప్రయత్నించే ఉన్మాదులకు గుణపాఠం చెప్పాలని..నేరం చేయాలంటేనే భయపడేలా భావితరాలకు గట్టి సందేశం ఇవ్వాలని ఈజిప్ట్‌ కోర్టు అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. కరడు కట్టిన నేరస్థుడికి మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఈజిప్ట్‌ పార్లమెంట్‌కు ఓ లేఖ కూడా రాసింది.

Also read : Saudi Arabia: ఒకే రోజు 81 మందికి మరణశిక్ష విధించిన సౌదీఅరేబియా

ఉత్తర ఈజిప్ట్‌లోని మాన్‌సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్‌ అడెల్‌..తను వివాహం చేసుకోవటానికి నిరాకరించిందని కక్ష కట్టి..తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు మోహమద్‌ అడెల్. ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత జూన్‌ నెలలోనే ఇది జరుగగా..జూన్‌ 28న మౌన్సౌరా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది మాన్‌సోరా కోర్టు. అంతేకాదు అతని మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఈజిప్ట్‌ పార్లమెంట్‌కు ఓ లేఖ కూడా రాసింది.భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా నిరోధించడానికి అతని మరణశిక్షను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని లేఖలో పేర్కొంది.

పూర్తిగా ఉరి తీయడం వీలు లేకున్నా.. కనీసం అతని ఉరి ఏర్పాట్లనైనా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆ లేఖలో కోర్టు పేర్కొంది. ఉన్మాదిగా మారి ఆమెను అతికిరాతకంగా చంపాడు. అందుకే దేశం మొత్తం అతని శిక్షను చూడాలి. ఈ శిక్ష ద్వారా ఇటువంటి దారుణాలకు పాల్పడాలనుకునేవాళ్లు వణికిపోవాలి. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే.. చట్టసభ అందుకు అనుమతించాలి’ అని లేఖలో పేర్కొంది కోర్టు. తీర్పు కిందటి నెలనే ఇచ్చినప్పటికీ.. జులై 24న తీర్పు కాపీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఈజిప్ట్‌ గ్రాండ్‌ ముఫ్తీ డాక్టర్‌ షాకీ అలం చేతిలో ఉంది.

Also read : నిర్భయ దోషులకు ఉరి…ప్రత్యక్షప్రసారం

అయితే న్యాయపరంగా పోరాడేందుకు అడెల్‌కు ఇంకా అవకాశం ఉంది. రెండు నెలల పాటు క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు హక్కు ఉందని అతని తరపు న్యాయవాది చెప్తున్నారు. ఇప్పటికే శిక్ష విధించి నెలరోజులు పూర్తైంది. ఇంకా నెలరోజులే మిగిలి ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయెరా అష్రాఫ్‌ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఘోరాతి ఘోరంగా చంపిన వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

కాగా గతంలో ఇలాగే ఓ శిక్షను ప్రజలు చూసేలా ప్రసారం చేశారు ఈజిప్టు అధికారులు. 1998లో రాజధాని కైరోలో ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన ముగ్గురు నిందితులను.. ఉరి తీసే కార్యక్రమాన్ని లైవ్‌ టెలికాస్ట్ చేశారు అక్కడి టీవీ ఛానెళ్లలో.

 

ట్రెండింగ్ వార్తలు