నిర్భయ దోషులకు ఉరి…ప్రత్యక్షప్రసారం

  • Published By: venkaiahnaidu ,Published On : January 10, 2020 / 01:16 PM IST
నిర్భయ దోషులకు ఉరి…ప్రత్యక్షప్రసారం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు పటియాలా కోర్టు ఈ నెల 22న కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలను మీడియాలో ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని ఎన్జీవో సంస్థ కేంద్ర సమాచార శాఖ(I&B)ను కోరింది. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఢిల్లీలో మెడిసిన్‌ చదువుతున్న బాలికను బస్సులో దారుణంగా రేప్‌ చేసి, తన శరీరాన్ని మొత్తం చిద్రం చేసిన ఆ క్రూర మృగాళ్ల మరణాన్ని యవత్‌ దేశ ప్రజలు చూడేలా మీడియాలో ఆ దృశ్యాలను ప్రసారం చేయాలని ఎన్జీవో కేంద్ర సమాచార శాఖను ఆశ్రయించింది. నిర్భయ మరణించిన 8 సంవత్సరాల అనంతరం దోషులకు కోర్టు ఉరిశిక్ష అమలు చేసింది. 

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు.

మిగతా నలుగురూ నిందితులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు నలుగురు దోషులను ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలులో నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా నలుగురిని ఒకేసారి ఉరితీయడం దేశచరిత్రలో ఇదే తొలిసారి.