Ukraine-Russia: మూడో ప్రపంచం యుద్ధం అంటూ జరిగితే అది అణు యుద్ధమే: రష్యా విదేశాంగ మంత్రి

మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే అది అణు యుద్ధమే అవుతుందని రష్యా విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాలను హెచ్చరించారు.

Ukraine-Russia: మూడో ప్రపంచం యుద్ధం అంటూ జరిగితే అది అణు యుద్ధమే: రష్యా విదేశాంగ మంత్రి

War

Ukraine-Russia: మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే అది అణు యుద్ధమే అవుతుందని రష్యా విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాలను హెచ్చరించారు. గత వారం రోజులుగా యుక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. ప్రపంచ దేశాల ఆంక్షలను సైతం లెక్కచేసే స్థితిలో లేదు. పైగా ఇతర దేశాలు ఈ యుద్ధంలో కలగజేసుకుంటే చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. భయాందోళనకు గురైన ప్రపంచ దేశాలు..రష్యాను ఎదిరించలేక మిన్నకుండిపోయాయి. దీంతో యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర అప్రతిహతంగా సాగుతుంది. అయితే రష్యా దాడులతో యుక్రెయిన్ భారీగా నష్టపోయింది.

Also read: Russia ukraine war : యుక్రెయిన్ నుంచి వచ్చిన భార‌తీయుల‌కు అరుదైన స్వాగ‌తం పలికిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

యుక్రెయిన్ లోని కీవ్, ఖార్కివ్ వంటి ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న రష్యా బలగాలు.. అక్కడి భవనాలను నేలమట్టం చేస్తున్నాయి. ఆయా నగరాల్లోని యుక్రెయిన్ సైనిక స్థావరాలను కూల్చివేశాయి పుతిన్ సేనలు. యుక్రెయిన్ అక్రమణే లక్ష్యంగా ఇప్పటికే కీవ్ నగరం సరిహద్దుల్లో వేలాది మంది రష్యన్ సైనికులు పాగావేసుకున్నట్లు అమెరికా నిఘావర్గాలు పంపిన శాటిలైట్ చిత్రాలు ద్వారా తెలుస్తుంది. కీవ్ నగరానికి సమీపంలో 65 కిలోమీటర్ల మేర అత్యాధునిక ఆయుధాలతో కూడిన రష్యా సైన్యం తిష్టవేసుకుని ఉంది. ఈక్రమంలో కీవ్ నగరంలో రష్యా అణు దాడి చేయనుందని అమెరికా నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఈక్రమంలో రష్యా చర్యలను తిప్పికొట్టేందుకు యుక్రెయిన్ సైతం తమ మిత్ర దేశాల నుంచి అణు బాంబులను తెప్పించి ప్రయోగించేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read: Putin: 10 వేల డాలర్ల కంటే ఎక్కువ డబ్బుతో దేశం దాటి వెళ్లకుండా నిషేధం విధించిన పుతిన్

ఇప్పటికే అణు బాంబు సమీకరణలో యుక్రెయిన్ ఉన్నట్లు వచ్చిన వార్తలపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందిస్తూ.. ఒక వేళ యుక్రెయిన్ గనుక..అణ్వయుధాలను సమీకరిస్తే..మూడో ప్రపంచ యుద్ధం తప్పదని.. మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే.. అది ప్రపంచ వినాశనమే అవుతుందని సెర్గీ లావ్రోవ్ అన్నారు. బుధవారం రష్యా మీడియాతో మాట్లాడిన సెర్గీ లావ్రోవ్.. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే తాము అణు బాంబు ప్రయోగించడం ఖాయమని ప్రపంచ దేశాలను హెచ్చరించారు.

Also Read: Ukraine: ఆపరేషన్ గంగ కార్యక్రమం వేగవంతం