Pakistani Artist: జుట్టు ఎక్కువ ఉందని జైళ్లో పెట్టారు.. !!

సామాజిక భద్రత కోసం తప్పుడు పనులు చేసేవారిని శిక్షించి సామాన్యులను కాపాడటం పోలీసుల బాధ్యత. మరి మంచి చెడులను గుర్తించడం ఎలా.. వేషధారణే మనిషి స్వభావాన్ని చెప్తుందా...

Pakistani Artist: జుట్టు ఎక్కువ ఉందని జైళ్లో పెట్టారు.. !!

Pakistani Artists Very Long Hair Landed Him In Jail

Pakistani Artist: సామాజిక భద్రత కోసం తప్పుడు పనులు చేసేవారిని శిక్షించి సామాన్యులను కాపాడటం పోలీసుల బాధ్యత. మరి మంచి చెడులను గుర్తించడం ఎలా.. వేషధారణే మనిషి స్వభావాన్ని చెప్తుందా… అంటే అవుననే అంటున్నారు పాకిస్తాన్ లోని లాహోర్ పోలీసులు.

తెల్లవారుజామున 3గంటల సమయంలో ఆటో కోసం ఎదురుచూస్తున్న అబుజర్ మధు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు ఇలా అని అడిగితే జుట్టు ఎక్కువ ఉందని చెప్పారు. అదే కారణంతో రాత్రంతా జైలులోనే గడపాల్సి వచ్చింది. మొత్తం విషయాన్ని అతని ఫ్రెండ్ నటాషాకు చెప్పగా ట్విట్టర్ లో ఒకటి తర్వాత ఒకటిగా పోస్టుల్లో చెప్పాడు.

కల్మా చాక్ వద్ద ఎదురుచూస్తున్న అబుజర్ మధును చూసి పోలీస్ వ్యాన్ ఆగింది. అధికారులు ఐడీ కార్డు అడగడంతో తీసుకెళ్లి చూపించాడు.. అయినప్పటికీ అరెస్టు చేసి వ్యాన్ ఎక్కించుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. తాను ఆర్టిస్ట్ అని ఒక టీచర్ ని అని చెప్పినా వినకుండా స్టేషన్ కు తీసుకెళ్లారు.

బ్యాగ్ మొత్తం చెక్ చేసినా కేవలం పుస్తకాలు దొరికినప్పటికీ అతణ్ని విడిచిపెట్టకుండా నైట్ మొత్తం జైలులో ఉంచారు. ఫోన్ లాక్కోబోయే ముందు కొందరు స్నేహితులకు మెసేజ్ అందించడంతో తర్వాతి రోజు ఉదయం వచ్చి విడిపించుకుని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు తమ పవర్ ను దుర్వినియోగం చేస్తూ.. ఒక టీచర్, ఆర్టిస్టును వేదించాలని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాడు అబుజర్ ఫ్రెండ్.

దీనిని బట్టి కొందరి జీవన విధానాలను కూడా కంట్రోల్ చేయాలని చూస్తున్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.