Chinese spy balloon: అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ కలకలం
చైనాకు చెందిన ఓ స్పై బెలూన్ అమెరికా గగనతలంలో కలకలం రేపుతోంది. దాన్ని కూల్చితే ప్రజలకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. ఆ బెలూన్ కొన్ని రోజులుగా మోంటానా రాష్ట్ర గగనతలంలోనే ఉందని చెప్పింది. దాన్ని నిఘా నిమిత్తమే పంపారని స్పష్టంగా తెలుస్తోందని అమెరికా అధికారులు చెప్పారు.

Chinese spy balloon
Chinese spy balloon: చైనాకు చెందిన ఓ స్పై బెలూన్ అమెరికా గగనతలంలో కలకలం రేపుతోంది. దాన్ని కూల్చితే ప్రజలకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. ఆ బెలూన్ కొన్ని రోజులుగా మోంటానా రాష్ట్ర గగనతలంలోనే ఉందని చెప్పింది. దాన్ని నిఘా నిమిత్తమే పంపారని స్పష్టంగా తెలుస్తోందని అమెరికా అధికారులు చెప్పారు.
అమెరికా, చైనా మధ్య ప్రతికూల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తైవాన్, చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన, దక్షిణ చైనా సముద్రంలో మిలటరీ కార్యకలాపాలు వంటి అంశాలపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చైనా బెలూన్ అమెరికాలో కనపడడం గమనార్హం. ఆ బెలూన్ అమెరికా గగన తలంలోకి ప్రవేశించినప్పటి నుంచి అమెరికా దాన్ని నిశితంగా గమనిస్తోంది.
దాన్ని అమెరికా మిలటరీ విమానం నుంచి కూడా అధికారులు పరిశీలించారు. ఆ బెలూన్ అంశాన్ని చైనా అధికారుల ముందు అమెరికా అధికారులు లేవనెత్తారు. గతంలోనూ పలుసార్లు స్పై బెలూన్లు అమెరికాలో కనపడ్డాయి. అయితే, ఈ సారి కనపడ్డ బెలూన్ పరిమాణంలో చాలా పెద్దగా ఉంది. ఆ బెలూన్ గురించి అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు.