Pompeii: పురావస్తు శాఖ అధికారులు కనుగొన్న 2వేల ఏళ్ల నాటి పురాతన గది

పాంపీలోని పురావస్తు శాస్త్రవేత్తలు 2వేల ఏళ్ల క్రితం నాటి పురాతన గదిని కనుగొన్నారు. క్రీస్తు శకం. 79వ సంవత్సరంలో సంభవించిన అగ్ని పర్వత విస్ఫోటనానికి సంబంధించిన శిథిలాల్లోని విల్లాను

Pompeii: పురావస్తు శాఖ అధికారులు కనుగొన్న 2వేల ఏళ్ల నాటి పురాతన గది

Archelogists

Pompeii: పాంపీలోని పురావస్తు శాస్త్రవేత్తలు 2వేల ఏళ్ల క్రితం నాటి పురాతన గదిని కనుగొన్నారు. క్రీస్తు శకం. 79వ సంవత్సరంలో సంభవించిన అగ్ని పర్వత విస్ఫోటనానికి గురైన శిథిలాల్లోని విల్లాను తవ్వారు. ‘అక్కడి ప్రాంతం బానిసల రోజువారీ జీవితంలోని అరుదైన అంతర్దృష్టిని ప్రతిబింబిస్తుంది’ అని అధికారులు శనివారం తెలిపారు.

ఇటలీ సాంస్కృతిక శాఖ మంత్రి, డారియో ఫ్రాన్సిస్చిని మాట్లాడుతూ.. ఈ రీసెర్చ్ ‘పురాతన పాంపీయన్ల రోజువారీ జీవితంలోని విషయాలను తెలియజేస్తుంది. ప్రత్యేకించి సమాజస్థాయి అంతకంటే తక్కువగా ఉందని తెలుస్తుంది’

డార్మిటరీగానూ….. స్టోరేజ్ ఏరియాగా ఆ గదిని వాడుకున్నట్లు కనపడుతుంది. జనవరిలో బయటపడ్డ ఉత్సవ రథానికి సమీపంలో ఉన్న సివిటా గియులియానాలోని పాంపీ శివారులోని ఒక విల్లాలో బయటపడింది.

…………………………………. : సార్..చిల్లర తీసుకోలేదు..అంటూ సజ్జనార్‌‌కు ట్వీట్

ఎటువంటి అలంకరణలు లేని గోడ.. ఎత్తైన కిటికీ, చెక్కతో చేసిన మూడు పడకల అవశేషాలు అందులో ఉన్నాయి. రెండు అడ్జస్టబుల్ బెడ్స్ ఒకటి 1.7 మీటర్లు (దాదాపు 5 అడుగులు, 7 అంగుళాలు) మరొకటి కేవలం 1.4 (4 అడుగులు, 7 అంగుళాలు) మీటర్లతో ఉన్నాయి. బహుశా పిల్లలతో ఉన్న కుటుంబం అక్కడ నివసించినట్లుగా భావిస్తున్నారు.

ఒక చెక్క పెట్టెలో లోహ వస్తువులు, వస్త్రాలు ఉన్నాయి. పురావస్తు ఉద్యానవన అధికారుల ప్రకారం., రథానికి చెక్క స్టీరింగ్ కూడా ఉంది. చాంబర్ కుండలు, ఇతర వ్యక్తిగత వస్తువులు పడకల క్రింద ఉన్నాయి. ఎనిమిది ఆంఫోరేలు (కూజాల వంటి వస్తువులు)- ఒక రకమైన కంటైనర్ – మూలగా ఉంచారు.

పురాతన రోమన్ నగరం శివార్లలో మధ్యధరా సముద్రం దగ్గరగా ఉన్న విల్లా, పాంపీలో ఇటీవల కనుగొన్న అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి ఇది. 2017లో ఆరోపించిన దోపిడీదారులు తవ్విన అక్రమ సొరంగాలను చూసిన తర్వాత పోలీసులు దీనిని కనుగొన్నారు.

………………………………………. : పునీత్ రాజ్‌కుమార్‌కు ‘బసవశ్రీ’ పురస్కారం

పురావస్తు శాస్త్రవేత్తలు ఇద్దరు వ్యక్తుల అస్థిపంజర అవశేషాలను కూడా కనుగొన్నారు, అందులో ఒక ధనవంతుడైన వ్యక్తి, అతని బానిస చావు నుంచి తప్పించుకునే క్రమంలో అగ్నిపర్వత బూడిద దాడికి చనిపోయి ఉండొచ్చని అంచనా.