Japanese Beef Croquettes : ఆర్డర్ చేసిన 30 ఏళ్లకు చేతికందే ‘అరుదైన వంటకం’..దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీకావు..

ఆర్డర్ చేసిన 30కు చేతికందే ‘ప్రత్యేక వంటకం’..దీని ప్రత్యేకతలు గురించి తెలుసుకోవాల్సిందే..

Japanese Beef Croquettes : ఆర్డర్ చేసిన 30 ఏళ్లకు చేతికందే ‘అరుదైన వంటకం’..దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీకావు..

Japanese Beef Croquettes

Japanese Beef Croquettes : కొన్ని ప్రత్యేక వంటాలు వేల రూపాయలు ఖర్చు చేస్తేనే కాని తినలేం. ముఖ్యంగా ప్రత్యేక సందర్భాల్లో చేసే స్వీట్లు..బంగారంతో తయారు చేసే స్పెషల్ బిర్యానీలు వంటివి. ధర ఎక్కువే అయినా తినాలని అనిపిస్తే డబ్బులు ఖర్చు చేయగలిగేవారు తినగలరు. స్విగ్గీ,జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలకు ఆర్డర్ చేస్తే 30, లేదా మహా అయితే ఓ గంటలో ఆర్డర్ చేసిన వంటకం నట్టింట్లో వాలిపోతుంది. కానీ ఓ వంటకం మాత్రం వేలు కాదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తినాలని అనిపించినప్పుడు తినలేం..ఆర్డర్ర చేస్తే గంట కాదు కదా..సంవత్సరం పాటు ఎదురు చూసినా తినలేం. ఎందుకంటే ఈ వంటకం తినాలని అనిపించి ఆర్డర్ చేస్తే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు 10 రోజులు కూడా కాదు ఏకంగా 30 ఏళ్లకు డెలివరీ అవుతుంది…!! వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజ్జమంటే నిజం..!!

అ ప్రత్యేక వంటకం పేరు ‘క్రోక్విట్స్’. చూడటానికి ఇది సాధారణ ఆలూ కట్లెట్ లా ఉంటుంది. కానీ తినాలంటే మాత్రం కాస్త కాదు చాలా ఏళ్లే పడుతుంది. ఈ క్రోక్విట్స్ వంటానికి కేవలం జపాన్ దేశంలో మాత్రమే తయారు చేస్తారు. చూడడానికి ఇవి ఆలూ కట్లెట్‌లా కనించినా ఇది జపాన్ దేశపు చాలా పాత వంటకం అట. గత 96 ఏళ్లుగా జపాన్ లో ‘ఆషియా’ అనే కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వంటకాన్ని తయారుచేస్తున్నారట.

ఇప్పుడు ఈ వంటకాన్ని ఆషియా ఫ్యామిలీలోని మూడవతరానికి చెందిన షిగేరు నిట్టా అనే వ్యక్తి తయారు చేస్తున్నాడట. దీని తయారీకి స్థానికంగా పండించే బంగాళాదుంపలు, జపాన్ కు చెందిన కోబ్‌ అనే నల్లజాతి పశువుల గొడ్డు మాంసాన్ని ఉపయోగిస్తారట. అయితే ఈ పశువుల్లో 3 సంవత్సరాల వయసున్న పశువుల మాంసాన్ని మాత్రమే వినియోగిస్తారట.

కాగా వీటిని వారంలో కేవలం రెండువందలు మాత్రమే తయారు చేస్తారట. అందుకే వీటిని ఎక్కువగా డిమాండ్ కు తగినట్లుగా చేయలేకపోతున్నారు. 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ క్రోక్విట్స్ ను అమ్మడానికి ఆన్లైన్ స్టోర్ ను ఓపెన్ చేశారు. అప్పటి నుండి వీటిని ఆర్డర్ చేసుకోవడం మొదలు పెట్టారు చాలామంది. అయితే వీటిని ఆర్డర్‌ చేసిన 30 ఏళ్ల లోపు ఎప్పుడైనా డెలివరీ అవుతుంది. అన్ని సంవత్సరాల తరువాత నిజంగానే డెలివరీ ఇస్తారా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. అయితే 2013 సెప్టెంబర్ 8న ఓ మహిళ ఈ డిష్ ను ఆర్డర్ చేయగా తాజాగా ఆమెకు డెలివరీ ఇచ్చినట్టు పేర్కొంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇంతకీ దీని ధర ఎంతో చెప్పలేదు కదూ… దీని ధర 1600 రుపాయలు. ఇందులో అయిదు కట్లెట్ లాంటి పీస్ లు ఉంటాయి. 2000 సంవత్సరంలో ఈ క్రోక్విట్స్ గురించి ఓ న్యూస్ పేపర్ ప్రచురించడంతో ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి తెలిసింది.