Telugu Indian Idol Season 4 : తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంచింగ్ ఈవెంట్‌.. ఎప్పుడు, ఎక్క‌డో తెలుసా?

తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol Season 4 ) నాలుగో సీజన్‌ అతి త్వ‌ర‌లో ప్రారంభంకానుంది. తమన్, సింగర్ కార్తీక్, గీతా మాధురిలు

Telugu Indian Idol Season 4 : తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంచింగ్ ఈవెంట్‌.. ఎప్పుడు, ఎక్క‌డో తెలుసా?

Telugu Indian Idol Season 4 grand lanch event on august 20th

Updated On : August 18, 2025 / 5:47 PM IST

Telugu Indian Idol Season 4 : ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఎల్ల‌ప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాడానికి సాంగ్స్, డ్యాన్స్ షోలను చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ లోకల్ సింగర్స్, తెలుగు వాళ్ళ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి షోని తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేసారు. ఈ షోకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్ల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుంది.

ఇక ఇప్పుడు నాలుగో సీజన్‌(Telugu Indian Idol Season 4)తో మ‌రోసారి సంగీత ప్రియుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది. ఈ సీజ‌న్ కోసం గ‌త కొద్ది రోజులుగా ఆడిష‌న్స్ కూడా నిర్వ‌హించారు. సింగింగ్ పై ఫ్యాష‌న్ ఉన్న వారు ఈ ఆడిష‌న్స్‌లో పాల్గొని త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు.

Demon Slayer : జపాన్ యానిమే సినిమా ఇప్పుడు తెలుగులో.. ట్రైలర్ రిలీజ్..

సంగీత ద‌ర్శ‌కుడు తమన్, సింగర్ కార్తీక్, గీతా మాధురిలు నాలుగో సీజ‌న్‌ను జ‌డ్జిలుగా ఉండ‌నున్నారు. ఈ నాలుగో సీజ‌న్ లాంచింగ్ ఈవెంట్‌ను ఈ నెల 20న హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)

థమన్, కార్తీక్, శ్రీరామ చంద్ర, సమీరా భరద్వాజ్, గీతామాధురి ఈ ఈవెంట్ లో పాల్గొన‌నున్నారు. ఫైన్షియల్ డిస్ట్రిక్ లో రాత్రి 7 గంటలకు ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది.