Russia Ukraine War : పుతిన్ కు కోపమొచ్చింది…రష్యాపై ఆంక్షలతో డెడ్లీ వార్నింగ్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు యుక్రెయిన్‌పై కోపమొచ్చింది.. ఎంతలా అంటే ఏకంగా వరల్డ్ మ్యాప్‌పై యుక్రెయిన్‌ అడ్రస్‌ గల్లంతు చేసేంతగా. ఇటు యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి.. అటు రష్యా

Russia Ukraine War : పుతిన్ కు కోపమొచ్చింది…రష్యాపై ఆంక్షలతో డెడ్లీ వార్నింగ్

Russia Ukraine War

Russia Ukraine War :  రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు యుక్రెయిన్‌పై కోపమొచ్చింది.. ఎంతలా అంటే ఏకంగా వరల్డ్ మ్యాప్‌పై యుక్రెయిన్‌ అడ్రస్‌ గల్లంతు చేసేంతగా. ఇటు యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి.. అటు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న నాటో దేశాలకు కంబైన్డ్‌గా డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చారు.

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ చేస్తున్న విజ్ఞప్తులు… మరోవైపు వరుసగా నాటో దేశాలు విధిస్తున్న ఆంక్షలతో చిర్రెత్తుకొచ్చిన పుతిన్‌.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే యుక్రెయిన్‌ ఉనికే లేకుండా చేస్తానని అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఆంక్షల అస్త్రాలు ప్రయోగిస్తే యుక్రెయిన్‌ అంతు చూస్తామని.. యుక్రెయిన్‌ పెద్దలు ఈ విషయాలను బుర్రలోకి ఎక్కించుకోవాలని ఫైర్ అయ్యారు.

నాటో దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు పుతిన్‌. రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని.. ఆంక్షలు విధించిన నాటో దేశాలన్ని తగిన మూల్యం చెల్లించుకునేందుకు రెడీగా ఉండాలని నిన్ననే ప్రకటించారు.

అయితే ఇంతలోనే పుతిన్‌ ఆగ్రహం కట్టలు తెగడానికి ప్రధాన కారణం యూఎస్‌ కాంగ్రెస్‌ ముందు జెలెన్‌స్కీ చేసిన ఓ విజ్ఞప్తి. రష్యాపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు ధన్యవాదాలు తెలిపిన జెలెన్‌స్కీ.. మరిన్ని ఆంక్షలు విధించాలని కోరారు. ముఖ్యంగా రష్యా చమురు ఎగుమతులపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేయడం.. ఇప్పటికే ఉన్న పుతిన్‌ మంటకు మరింత ఆజ్యం పోసినట్టైంది.

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి రష్యాపై ఆంక్షల అస్త్రాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి నాటో దేశాలు. బ్యాంకింగ్‌ నుంచి ఇంధనం వరకు అన్ని రంగాలలో రష్యాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా మాస్టర్ కార్డ్, వీసీ కార్డ్‌ల సేవలను కూడా రష్యాలో నిలిపివేశారు. అయితే అన్ని ఆలోచించి.. దేనికైనా సిద్ధమని ఫిక్స్‌ అయ్యాకే కదనరంగంలోకి దిగామని ఇప్పటికే పుతిన్‌ తెలిపారు.
Also Read : Ukraine Indian Help : యుద్ధం ఆగడానికి భారత్ సాయం కోరిన యుక్రెయిన్.. పుతిన్‌తో మాట్లాడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి
ఎవ్వరేం చేసినా తాము అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు యుద్ధం ఆపేది లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంత జరుగుతున్నా జెలెన్‌స్కీ ఇంకా నాటో దేశాల చెంత చేరడం పుతిన్‌ డైజెస్ట్ చేసుకోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. చూసింది గోరంతే.. చూడాల్సింది కొండంత ఉందంటూ అటు నాటో దేశాలకు.. ఇటు యుక్రెయిన్‌కు చెప్పకనే చెబుతున్నారు పుతిన్‌.