Ukraine Indian Help : యుద్ధం ఆగడానికి భారత్ సాయం కోరిన యుక్రెయిన్.. పుతిన్‌తో మాట్లాడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి

యుద్ధం ప్రపంచ ప్రయోజనాలకు వ్యతిరేకమేనని పుతిన్‌కు భారత్ వివరించాలని యుక్రెయిన్ కోరింది. ఈ మేరకు భారత ప్రధాని మోదీని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు.

Ukraine Indian Help : యుద్ధం ఆగడానికి భారత్ సాయం కోరిన యుక్రెయిన్.. పుతిన్‌తో మాట్లాడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి

Kuleba

Ukraine Indian Help : రష్యా తమపై దాడులను ముమ్మరం చేయడంతో యుక్రెయిన్ మరోసారి భారత్ మద్దతు కోరింది. తమ దేశంపై చేస్తున్న దాడులకు పుతిన్ ముగింపు పలికేలా భారత్ చొరవ తీసుకోవాలని యుక్రెయిన్‌ విజ్ఞప్తి చేసింది. యుద్ధ పరిణామాలను పుతిన్‌కు మోదీ వివరించాలని అన్నారు. యుద్ధం ప్రపంచ ప్రయోజనాలకు వ్యతిరేకమేనని పుతిన్‌కు భారత్ వివరించాలని యుక్రెయిన్ కోరింది. ఈ మేరకు భారత ప్రధాని మోదీని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు.

యుక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకునే అతి పెద్ద వినియోగదారు భారతేనన్నారు. యుద్ధం కొనసాగితే కొత్త పంటలను వేయడం సాధ్యం కాదని దిమిత్రో అన్నారు. యుద్ధం ఇంకా కొనసాగితే భారత్ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని పేర్కొన్నారు. భారత తమ ఆహార భద్రత కోసమైనా యుద్ధాన్ని ఆపడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఇదే విధంగా ఓ ట్వీట్ చేసింది. ప్రపంచ ఆహార భద్రతకు హామీ ఇస్తున్న దేశాల్లో యుక్రెయిన్ ఒకటి అని తెలిపింది.

Russia : యుక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా కీలక ప్రకటన-90 యుక్రెయిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 76 రాకెట్ లాంచర్లు ధ్వంసం

ప్రపంచ ఆహార భద్రతకు యుక్రెయిన్ దోహదం చేస్తోందని వెల్లడించారు. తమ దేశంలో ఉత్పత్తి అయిన సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో 55 శాతం మేరకు ప్రపంచానికి ఎగుమతి అవుతోందని తెలిపింది. ఈ యుద్ధం భారత ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తోందని అభిప్రాయపడింది. దీనిని దృష్టిలో పెట్టుకోని అయినా.. యుద్ధాన్ని ఆపాలని పుతిన్‌ను భారత్ చెప్పాలని యుక్రెయిన్‌ తెలిపింది. తమ దేశ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం భారత్‌లోనే ఎక్కువని తెలిపారు.

యుద్ధం ఇంకా కొనసాగితే భారత్ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని పేర్కొన్నారు. భారత.. తన ఆహార భద్రత కోసమైనా యుద్ధాన్ని ఆపించాలని తెలిపారు. ‘అందుకే పుతిన్‌కు మీరైనా చెప్పండి.. యుద్ధాన్ని ఆపమని’ అని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో యుద్ధాన్ని కోరుకునే ఏకైక వ్యక్తి పుతిన్ మాత్రమేనని స్పష్టం చేశారు. రష్యా ప్రజలకు కూడా యుద్ధం ఇష్టం లేదన్నారు.