Russia : యుక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా కీలక ప్రకటన-90 యుక్రెయిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 76 రాకెట్ లాంచర్లు ధ్వంసం

ఇప్పటి వరకు యుక్రెయిన్‌కు చెందిన 748 యుద్ధ ట్యాంక్‌లు, సైనిక వాహనాలు.. 68 రాడార్ స్టెషన్స్‌.. 2 వేల 119 మిలటరీ బిల్డింగ్‌లు.. 76 రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.

Russia : యుక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా కీలక ప్రకటన-90 యుక్రెయిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 76 రాకెట్ లాంచర్లు ధ్వంసం

Russia

Russia key statement : యుక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా కీలక ప్రకటన చేసింది. యుక్రెయిన్‌లో తాము సృష్టించిన విధ్వంసంపై రష్యన్‌ ఆర్మీ లెక్కలు విడుదల చేసింది. రష్యన్ బలగాలు జరిపిన దాడుల్లో 90 యుక్రెయిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయని తెలిపింది. ఇందులో 21 ఫైటర్‌ జెట్లు ఉన్నాయని తెలిపింది.

ఇప్పటి వరకు యుక్రెయిన్‌కు చెందిన 748 యుద్ధ ట్యాంక్‌లు, సైనిక వాహనాలు.. 68 రాడార్ స్టెషన్స్‌.. 2 వేల 119 మిలటరీ బిల్డింగ్‌లు.. 76 రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. 532 మిలటరీ వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. యుక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత రష్యా ఇలాంటి లెక్కలు విడుదల చేయడం ఇదే తొలిసారి.

Russia Attack : యుక్రెయిన్ పై 11 రోజులుగా రష్యా దాడులు.. ఖార్కివ్, మైకోలైవ్, సుమి అష్టదిగ్భందం

ఇప్పటి వరకు రష్యన్ బలగాలను ఎలా మట్టుపెడుతున్నాం.. ఎంతమందిని మట్టుపెట్టామని యుక్రెయిన్‌ అధికారికంగా ప్రకటిస్తూ వచ్చింది. ఓ వైపు యుక్రెయిన్‌ ప్రకటనలు కొనసాగుతుండగానే.. రష్యా తాము చేయాల్సిన పనులు సైలెంట్‌గా చేస్తూ వచ్చింది. కానీ తొలిసారి రష్యన్‌ ఆర్మీ యుక్రెయిన్‌ను ఏ విధంగా దెబ్బతిస్తున్నామని లెక్కలతో సహా వివరించింది.

మరోవైపు రష్యా సైన్యం వెన్ను విరుస్తున్నానమని యుక్రెయిన్‌ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తోంది. రష్యా సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతిసేలా వారికి వార్నింగ్‌లు ఇస్తోంది. ఇప్పటి వరకు 9 వేల 166 మంది రష్యా సైనికులను మట్టుపెట్టినట్టు ప్రకటించింది. 200 యుద్ధ ట్యాంకులను, 800 సైనిక వాహనాలను, 37 అటాక్‌ హెలికాప్టర్లను, 33 ఫైటర్‌ జెట్లను కూల్చేసినట్లు, 2 బోట్లను ధ్వంస యుక్రెయిన్‌ అనౌన్స్‌ చేసింది. 60 ఇంధన ట్యాంకులు, 404 కార్లు, 251 ట్యాంకులను ధ్వంసం ప్రకటింది.