Russia Attack : యుక్రెయిన్ పై 11 రోజులుగా రష్యా దాడులు.. ఖార్కివ్, మైకోలైవ్, సుమి అష్టదిగ్భందం

మరియుపోల్, వోల్నోవాఖాలపై రష్యా దాడులు ఉధృతం చేసింది. రష్యా దాడులు కొనసాగుతుండటంతో పౌరుల తరలింపు నిలిచిపోయింది. యుక్రెయిన్ కు సముద్ర మార్గాల సంబంధాలు తెగ్గొటేలా దాడులు చేస్తోంది.

Russia Attack : యుక్రెయిన్ పై 11 రోజులుగా రష్యా దాడులు.. ఖార్కివ్, మైకోలైవ్, సుమి అష్టదిగ్భందం

War

Russian military operation : యుక్రెయిన్ పై 11 రోజులుగా రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. క్షిపణులు, బాంబుల మోతతో యుక్రెయిన్ దద్దరిల్లుతోంది. మూడో అణు విద్యుత్ ప్లాంట్ స్వాధీనం దిశగా రష్యా అడుగులు వేస్తోంది. మైకోలైవ్ కి 120 కి.మీ దూరంలో ఉన్న ప్లాంట్ పై పట్టు కోసం యత్నిస్తోంది. యుజ్నైక్రైన్ స్క్ అణు విద్యుత్ కేంద్రానికి ముప్పు పొంచి ఉందని యుక్రెయిన్ తెలిపింది. ఇప్పటికే రెండు అణు విద్యుత్ కేంద్రాలను రష్యా స్వాధీనం చేసుకుంది.

ఖార్కివ్, మైకోలైవ్, సుమి నగరాలను అష్టదిగ్భందం చేశారు. మరియుపోల్, వోల్నోవాఖాలపై రష్యా దాడులు ఉధృతం చేసింది. రష్యా దాడులు కొనసాగుతుండటంతో పౌరుల తరలింపు నిలిచిపోయింది. యుక్రెయిన్ కు సముద్ర మార్గాల సంబంధాలు తెగ్గొటేలా రష్యా దాడులు చేస్తోంది. జైటోమీర్ ప్రాంతంలో 4 యుద్ధ విమానాలను రష్యా కూల్చింది. యుక్రెయిన్ ఎస్ యూ 27 జెట్ లను రష్యా బలగాలు కూల్చివేశాయి. కీవ్ నగరంలోకి రష్యా సేనలు రాకుండా యుక్రెయిన్ సైన్యం పోరాడుతోంది.

Ukrainian Army : యుక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన

మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఫోన్​ చేశారు. ఉక్రెయిన్ భద్రత, ఆర్థిక సహకారం, రష్యాపై ఆంక్షల కొనసాగింపు లాంటి కీలక అంశాలపై ఫోన్ కాల్ లో మాట్లాడారు. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత బైడెన్​తో జెలెన్ స్కీ ఫోన్ లో మాట్లాడటం ఇది రెండోసారి. మార్చి 6 ఆదివారం దాదాపు అర్ధగంట పాటు ఫోన్ కాల్ లో చర్చలు జరిగినట్లు జెలెన్ స్కీ తెలిపారు.

ముందెన్నడూ చూడని భీకరమైన దాడిని రష్యా చేస్తుండటంతో.. బాధిత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాను మరోసారి అభ్యర్థించారు. “ఇప్పటికే కొనసాగుతున్న చర్చల్లో భాగంగా మరోసారి అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడాను. యుక్రెయిన్ ను కాపాడుకోవడం.. రష్యాను కంట్రోల్ చేయడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టాం” అని జెలెన్ స్కీ చెప్పారు. అంతకముందు యుక్రెయిన్ చట్ట సభ సభ్యులతో వీడియో లింక్ ద్వారా జెలెన్ స్కీ మాట్లాడారు.

Ukraine – Singareni : సింగరేణిపై రష్యా- యుక్రెయిన్ యుద్ధం ప్రభావం

యుద్ధంలాంటి క్లిష్ట సమయంలో సహకారం అందించాలని.. రష్యన్ ఆయిల్ దిగుమతులను బ్లాక్ లిస్ట్ చేయాలని కోరారు. యుక్రెయిన్ కు అదనంగా 10 బిలియన్ డాలర్ల ప్యాకేజీని సాయంగా అందిస్తామని అమెరికా ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, రష్యాపై ఆయిల్ బ్యాన్ కు మాత్రం వైట్ హౌజ్ ఒప్పుకోలేదు. ఇప్పటికే రికార్డ్ స్థాయి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న అమెరికా.. ఆయిల్ బ్యాన్ చేస్తే రేట్లు మరింత పెరిగి ఇబ్బందుల్లో పడతామని భావిస్తోంది.

యూఎస్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా 350 మిలియన్ డాలర్ల మిలటరీ ఎక్విప్ మెంట్ యుక్రెయిన్ కు చేరనుంది. వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి యుక్రెయిన్ కు అందుతోంది. యుక్రెయిన్ పై ఫిబ్రవరి 24, 2022 నుంచి మొదలైన రష్యా యుద్ధం రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. కీవ్, ఖార్కివ్ నగరాల్లో కాల్పులకు బ్రేక్ ఇచ్చామని చెప్పిన రష్యా.. ఇతర నగరాలపై భీకర దాడులు కొనసాగిస్తోంది.