Ukrainian Army : యుక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన

39 రష్యా యుద్ధ విమానాలు, 40 హెలికాఫ్టర్లను కూల్చేసినట్లు తెలిపారు. 269 ట్యాంకులను నాశనం చేయడం లేదా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Ukrainian Army : యుక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన

Ukraine

Ukrainian army statement : యుక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. 10రోజుల రష్యా-యుక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు భారీ సైనిక నష్టమే జరిగింది. ఈ పదిరోజుల్లో 10వేలమంది రష్యా సైనికుల్ని లేపేశామని యుక్రెయిన్ ప్రకటించింది. యుక్రెయిన్‌ ఆర్మీ చీఫ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 39 రష్యా యుద్ధ విమానాలు, 40 హెలికాఫ్టర్లను కూల్చేసినట్లు తెలిపారు. 269 ట్యాంకులను నాశనం చేయడం లేదా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 945యుద్ధ వాహనాలు, 105 ఆర్టిలరీ సిస్టమ్స్‌ రష్యా కోల్పోయిందన్నారు. ప్రస్తుతం రష్యా సైనికులు తీవ్ర నిరాశలో ఉన్నారని… యుక్రెయిన్‌లో చొరబడ్డ వారికి ఇప్పుడు కనీసం తిండి, నీళ్లు కూడా అందట్లేదన్నారు.

మందుగుండు కూడా అందక రష్యన్ సైనికులు లొంగిపోతున్నారని యుక్రెయిన్ సైనిక అధికారి చెప్పుకొచ్చారు. యుక్రెయిన్ సైనికులే కాకుండా సామాన్యులు కూడా తమజోలికి వస్తే ఏం జరుగుతుందో రష్యన్లకు చూపించారని ఇది రష్యా సైనికుల్ని మానసికంగా మరింత కుంగతీసిందంటున్నారు. రష్యా సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు. అయితే తమవైపు ఎంత నష్టం జరిగిందన్నది ఇంతవరకు రష్యా వెల్లడించలేదు. అయితే తాము 2వేలకు పైగా యుక్రెయిన్ సైనిక స్థావరాలు, భవనాలను కుప్పకూల్చామని చెప్పుకొచ్చింది.

Russia Attack : యుక్రెయిన్‌ చెర్నివ్‌పై మరోసారి రష్యా భీకర దాడులు.. 33మంది మృతి, వందల మందికి గాయాలు

మరోవైపు మరియుపోల్‌లో పౌరుల తరలింపునకు బ్రేక్ పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా సామాన్యులపై మరోసారి కాల్పులకు తెగబడిందని యుక్రెయిన్ మండిపడుతోంది. రష్యా కాల్పులకు తెగబడుతుండడంతో పౌరుల తరలింపు ప్రక్రియ నిలిపివేసినట్లు యుక్రెయిన్ అధికారులు అధికారులు ప్రకటించారు.

దీంతో మరియుపోల్‌లోని పౌరులు అయోమయంలో పడ్డారు. మరికొన్ని గంటల్లో రష్యా ప్రకటించిన అధికారిక కాల్పుల విరమణ గడువు ముగియునుంది. ఈలోగా తప్పించుకోకుంటే ప్రాణాలు ఉంటాయో లేదోనన్న ఆందోళన అక్కడి పౌరుల్లో నెలకొంది.