Russia vs ukraine war: పుతిన్.. మరీ ఇంత క్రూరత్వమా.. రష్యాను వ్యతిరేకించే దేశాలకు మరో షాకిచ్చిన పుతిన్..

ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తుంది. ఉక్రెయిన్ సైన్యం లొంగిపోయే వరకు తాము వెనుకడుగు వేసేదే లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఇరు దేశాలు నువ్వానేనా...

Russia vs ukraine war: పుతిన్.. మరీ ఇంత క్రూరత్వమా.. రష్యాను వ్యతిరేకించే దేశాలకు మరో షాకిచ్చిన పుతిన్..

Russia Vs Ukrian

Russia vs ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తుంది. ఉక్రెయిన్ సైన్యం లొంగిపోయే వరకు తాము వెనుకడుగు వేసేదే లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఇరు దేశాలు నువ్వానేనా అన్నట్లు యుద్ధం చేసుకుంటున్నాయి. రష్యా సేనలు ఉక్రెయిన్‌లో నరమేధాన్ని సృష్టిస్తుండటంతో ప్రపంచంలోని అనేక దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి. ఆయుధాలను సమకూర్చుతున్నాయి. ఇటీవలి కాలంలో బుచాలో వెలుగు చూసిన రష్యా సేనల దురాగతాలు యావత్ ప్రపంచాన్ని కన్నీరు పెట్టించాయి.

Russia Uses Kalibr : యుక్రెయిన్‌పై పవర్‌ఫుల్ మిస్సైల్స్‌తో రష్యా దాడి.. రెండోసారి కాలిబర్ ప్రయోగం

బుచాలో సామాన్య పౌరుల చేతులను కట్టేసి కాల్చి చంపినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు, చిన్నారులు అని చూడకుండా హతమార్చిన ఫొటోలు బయటకొచ్చాయి. ఈ మారణ హోమానికి బ్రిగేడ్ సభ్యులే కారణమని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా సైన్యం అకృత్యాలపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో పుతిన్ తనకు వ్యతిరేకంగా, ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న ప్రపంచ దేశాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నాడు. బుచా మారణ హోమంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను రష్యా అధ్యక్షుడు పుతిన్ సత్కరించడం చర్చనీయాంశంగా మారింది.

Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..

బుచాలో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సైనికులను పుతిన్ ప్రశంసలతో ముంచెత్తారు. బ్రిగేడ్ కు అక్కడి మిలటరీలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన గార్డ్స్ గౌరవ బిరుదును ప్రకటించారు. మాతృభూమితో పాటు దేశ ప్రయోజనాల కోసం పోరాడినందుకు గాను 64వ మోటార్‌ రైఫిల్‌ బ్రిగేడ్‌కు ‘గార్డ్స్‌’ అనే బిరుదును ఇస్తున్నానని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై అధ్యక్షుడు పుతిన్‌ సంతకం చేశారు. ఓ పక్క బుచా నరమేధానికి పాల్పడిన రష్యా సైన్యంపై చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్న దేశాలు డిమాండ్ చేస్తున్న క్రమంలో.. బుచాలో నరమేధానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అవార్డులు ఇవ్వడంతో పుండుపై కారంచల్లినట్లుగా పుతిన్ వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.