Putin Presents Gold Rrings : 8 దేశాల అధ్యక్షులకు బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చిన పుతిన్

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఎనిమిది దేశాల అధ్యక్షులకు బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారు. కామ‌న్‌వెల్త్ చిహ్నాలతో కూడిన ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్‌(CIS) దేశాధినేత‌ల‌కు గోల్డ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఎనిమిది మంది దేశాధినేత‌ల‌కు పుతిన్ బంగారు ఉంగ‌రాల‌ను అందజేశారు.

Putin Presents Gold Rrings :  8 దేశాల అధ్యక్షులకు బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చిన పుతిన్

putin presents gold rings

putin presents gold rings ; ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఎనిమిది దేశాల అధ్యక్షులకు బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారు. మంగళవారం (డిసెంబర్ 27,2022) కామ‌న్‌వెల్త్ చిహ్నాలతో కూడిన ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్‌(CIS) దేశాధినేత‌ల‌కు గోల్డ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఎనిమిది మంది దేశాధినేత‌ల‌కు పుతిన్ బంగారు ఉంగ‌రాల‌ను అందజేశారు. ఆ రింగ్‌ల‌పై CIS గుర్తుతోపాటు హ్యాపీ న్యూ ఇయ‌ర్ 2023 అని ప్రింట్ చేసి ఉంది. ఈ స‌మావేశం జ‌రుగుతున్న ర‌ష్యా దేశం పేరు కూడా ఆ రింగ్‌ల‌పై ఉండేలా డిజైన్ చేయించారు పుతిన్.

ఉంగరాలు బహుమతిగా పొందినవారిలో బెలార‌స్ అధ్య‌క్షుడు అలెగ్జాండ‌ర్ లుక‌షెంకో, అజ‌ర్‌బైజాన్ అధ్య‌క్షుడు ఇలాహం అలియేవ్‌, క‌జ‌కిస్తాన్ అధ్య‌క్షుడు కాసిమ్ జోమార్ట్ టొక‌యేవ్‌, కిర్గిస్తాన్ అధ్య‌క్షుడు స‌దిర్ జప‌రోవ్‌, త‌జ‌కిస్తాన్ అధ్య‌క్షుడు ఎమ్మోలీ ర‌హ‌మాన్‌, తుర్క‌మిస్తాన్ అధ్య‌క్షుడు స‌ర్దార్ బెర్డిమువ‌మేదేవ్‌, ఉజ్బెకిస్తాన్ అధ్య‌క్షుడు ష‌వ‌క‌త్ మిర్జియోవేవ్‌, అర్మేనియా ప్ర‌ధాని నికోల్ ప‌షిన్యావ్‌లు ఉన్నారు. వీరికి పుతిన్ స్వయంగా బంగారు ఉంగ‌రాల‌ను అంద‌జేశారు.

కాగా పుతిన్ ఉంగరం అందించిన వెంటనే బెలార‌స్ అధ్య‌క్షుడు అలెగ్జాండ‌ర్ లుక‌షెంకో మాత్రం వెంటనే తన వేలికి ఉంగరాన్ని తొడుక్కున్నారు. మరి ఎవరు ఉంగరాలను పెట్టుకున్నట్లుగా లేదు. ఈ ఎనిమిదిమంది అధ్యక్షులతో పాటు పుతిన్ కూడా త‌న కోసం ఓ రింగ్‌ను ఉంచుకున్నారు.

ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ..”దురదృష్టవశాత్తూ, కామన్వెల్త్‌లోని సభ్య దేశాల మధ్య కూడా విభేదాలు తలెత్తుతున్నాయని అంగీకరించాలి” అని ఈ సమావేశంలో బహిరంగంగానే అంగీకరించారు. అలాగే ఏది ఏమైనా ఎటువంటి విభేదాలు,సమస్యలు తలెత్తినా మేము సంయుక్తంగా,సహృదయంగా సహాయం సహకారాలు అందించుకుంటామని ఉన్న సమస్యలను పరిష్కరించుకోవటానికి కృషి చేస్తామని పుతిన్ అన్నారు.

కాగా ఈ సీఐఎస్ దేశాల‌న్నీ ఒక‌ప్పుడు సోవియేట్‌లో భాగ‌ంగా ఉండేవి. మాజీ సోవియేట్ స‌భ్య‌దేశాల మ‌ధ్య స‌హ‌కారం కోసం ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. పుతిన్ గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇవ్వటం సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై ఎవరికి తోచినట్లు వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కాగా యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం విషయంలో అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తున్న వేళ పుతిన్ మాజీ సోవియట్ రిజబ్లిక్ దేశాల మద్దతును కూడగట్టటానికే యత్నిస్తున్నారు. దీని కోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవటంలేదు.