ట్యాప్ తిప్పితే..రెడ్ వైన్ వచ్చింది

  • Published By: madhu ,Published On : March 9, 2020 / 03:09 AM IST
ట్యాప్ తిప్పితే..రెడ్ వైన్ వచ్చింది

నల్లా తిప్పితే.. ఏం వస్తుంది..అంటే..గిదేం ప్రశ్న..అంటారు కదా..ట్యాంకులో ఉన్న నీళ్లు వస్తాయి..ఇదిగాక ఇంకేమన్నా వస్తాయా అంటారు కదా..కానీ ఆ ప్రాంతంలో ట్యాప్ తిప్పగానే..రెడ్ వైన్ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటలీలోని ఓ ప్రాంత ప్రజలు ఇలాంటి అనుభూతిని ఫేస్ చేశారు. కొంతమంది అయితే..బాటిళ్లలో నిల్వ చేసుకున్నారంట. ఈ ఘటన మోడెనాకు ఉత్తర ఇటాలియన్ పట్టణంలోని కాస్టెలెట్రో టౌన్‌లో చోటు చేసుకుంది. 

వాటర్ పైపులైన్ ఉన్న ప్రాంతంలోనే ఓ వైన్ కంపెనీకి చెందిన పైపులైన్ కూడా ఉంది. అయితే..సెట్టెకానీ వైనరీ వద్ద పైపులైన్ వాల్వ్ మొరాయించింది. దీంతో కాస్టెల్వెట్రో టౌన్ వాటర్ పైపులైన్‌లోకి ఎర్రటి వైన్ (లాంబ్రస్కో గ్రాస్పరోస్పా) ప్రవేశించింది. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు..ట్యాప్ తిప్పగానే..వైన్ రావడం గమనించారు. ఈ విషయం అక్కడున్న వారందరికీ తెలిసిపోయింది.

కొంతమంది అయితే..బాటిళ్లల్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంట. వైన్ లీక్ అయ్యిందన్న విషయం తెలియగానే..నీటి సరఫరాను నిలిపివేశారు. ఇది గత బుధవారం చోటు చేసుకుంది. సుమారు 3 గంటల సేపు..20 ఇళ్లల్లోకి వైన్ ప్రవేశించిందని అంచనా వేశారు. అలర్ట్ అయిన..అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ లీక్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హానీ, ప్రమాదాలు జరగలేదని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. 

See Also | కరోనాను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్లు