Russia and Ukraine : యుక్రెయిన్‌‌లో నర్సరీ స్కూల్‌‌పై బాంబుల వర్షం

రష్యా-యుక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణలు రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతున్నాయి. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని...

Russia and Ukraine : యుక్రెయిన్‌‌లో నర్సరీ స్కూల్‌‌పై బాంబుల వర్షం

Ukraine

Updated On : February 18, 2022 / 3:23 PM IST

Russia Backed Troops Shelled Nursery School : యుక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా అనుకూల వేర్పాటువాదులు రెచ్చిపోయారు. యుక్రెయిన్‌లోని ఓ నర్సరీ స్కూల్‌పై బాంబుల వర్షం కురిపించారు. దీంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్కూల్లో చిన్నారులు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో.. స్కూల్ జిమ్‌పై బాంబులు విసిరేశారు. మరో 15 నిమిషాల్లో చిన్నారులు జిమ్ క్లాస్‌కి హాజరుకావాల్సి ఉంది. ఒకవేళ జిమ్ క్లాస్ ముందుగానే నిర్వహించి ఉంటే తీరని నష్టం జరిగే ఉండేదని స్కూల్ టీచర్లు వాపోయారు. అయితే.. యుద్ధం వస్తుందనే హెచ్చరికగా అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. రష్యానే యుక్రెయిన్‌లోని వేర్పాటువాదుల చేత స్కూల్‌పై దాడి చేయించినట్లు ఆరోపిస్తున్నాయి. తూర్పు యుక్రెయిన్‌లోని డాన్‌బస్ ప్రాంతంలో పలుచోట్ల బాంబులు జారవిడిచారు వేర్పాటువాదులు.

Read More : Ukraine Grandma : ‘నా దేశం యుక్రెయిన్‌ కోసం యుద్ధానికి సిద్ధం’అంటున్న 79 ఏళ్ల బామ్మ..

అటు రష్యా-యుక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణలు రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతున్నాయి. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని రష్యా తరలించినట్లుగా అమెరికా ఆరోపిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి తాము చేస్తోన్న చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదని అమెరికా ఓవైపు చెబుతుండగా… రష్యా యధావిధిగా అగ్రరాజ్యం ఆరోపణలను ఖండిస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అమెరికా సెనెట్.. ఓ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే తాను ఎటు వైపు మొగ్గు చూపాలనేది ఈ తీర్మానం సారాంశం. సెనెట్ సభ్యులంతా యుక్రెయిన్‌కు మద్దతు పలికేలా రూపొందించిన తీర్మానం అది.

Read More : Ukraine Crisis : యుక్రెయిన్ సంక్షోభం.. మన వంటిల్లు ఇక భారమే.. ఎందుకంటే?

ఈ తీర్మానంపై సెనెట్ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. యుక్రెయిన్‌పై యుద్ధానికి దిగితే రష్యా తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఇదివరకే హెచ్చరించారు. ఇదే విషయాన్ని సెనెట్ సభ్యులు మరోసారి తేల్చిచెప్పారు. రష్యాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా ఆంక్షలను విధించాలనే విషయం సెనెట్‌లో చర్చకు వచ్చింది. ఒకవేళ యుక్రెయిన్‌-రష్యా సరిహద్దుల నుంచి రష్యా పూర్తిస్థాయిలో బలగాలు ఉపసంహరించుకోకపోతే రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.