Russia-Ukraine Conflict : 1990లో యుక్రెయిన్ అణ్వాయుదాలను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది?

సోవియట్ యూనియన్ పతనం తర్వాత.. కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశమే ఈ యుక్రెయిన్.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద అణుశక్తి కలిగిన దేశం కూడా.

Russia-Ukraine Conflict : 1990లో యుక్రెయిన్ అణ్వాయుదాలను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది?

Russia Ukraine Conflict Why Did Ukraine Give Up Its Nuclear Weapons In 1990s

Russia-Ukraine Conflict : ప్రపంచ దేశాలు ఊహించినట్టే రష్యా యుక్రెయిన్‌పై దాడికి దిగింది. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్రను మొదలుపెట్టింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (ఫిబ్రవరి 24న) గురువారం యుక్రెయిన్‌లో దేశంలో ‘మిలిటరీ ఆపరేషన్’ను ప్రకటించారు. ఈ చర్య కేవలం పౌరులను రక్షించడానికి మాత్రమేనని ఆయన ప్రసంగంలో తెలిపారు. యుక్రెయిన్ నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు టెలివిజన్ ప్రసంగంలో పుతిన్ స్పష్టం చేశారు. యుక్రెయిన్‌ను ఆక్రమించాలనే లక్ష్యం రష్యాకు ఎప్పటికీ లేదని ఆయన అన్నారు. యుక్రెయిన్‌లో రక్తపాతానికి బాధ్యత ఆ దేశ పాలనపైనే ఉందని పుతిన్ చెప్పినట్టు ది గార్డియన్ నివేదించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం.. ఉదయం 5 గంటలకు పుతిన్ టెలివిజన్ ప్రసంగం చేసిన కొద్ది నిమిషాల్లోనే రాజధాని కైవ్‌తో సహా యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలకు సమీపంలో భారీ స్థాయిలో పేలుళ్లు వినిపించాయి. రష్యా దాడికి ముందు నుంచే యుక్రెయిన్ దౌత్య మార్గంలో వెళ్లి సయోధ్య కోసం ప్రయత్నించింది. రష్యాతో సమస్యలను చర్చించడానికి ముందుకొచ్చింది. కానీ, పుతిన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కఠినమైన విధానాన్ని అవలంభిస్తున్నారు. రష్యాపై ప్రతిదాడి చేసేందుకు తన వద్ద అణ్వాయుధాలను కలిగిలేదు. ఎందుకంటే 1990లోనే యుక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడే తన అణ్వాయుదాలను వదులుకోవాల్సి వచ్చింది.

అణ్వాయుధాలను ఎందుకు వదులుకుందంటే?
1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత.. కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశమే ఈ యుక్రెయిన్.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద అణుశక్తి కలిగిన దేశం కూడా. వేలాది అణ్వాయుధాలు యుక్రేనియన్ గడ్డపై నుంచి వదులుకోవాల్సి వచ్చింది. అప్పడే ఆ ఆయుధాలను రష్యాకు పంపాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇతర దేశాల దురాక్రమణకు అడ్డుకోవాలంటే ఈ ఆయుధాలను బీమాగా ఉంచాలని పిలుపునిచ్చారు. యుక్రెయిన్‌లో వేలాది అణ్వాయుధాలను ఉన్నప్పటికీ వాటిపై కార్యాచరణ నియంత్రణ లేకుండా పోయింది. ఆయుధాలను పేల్చడం, ఉపయోగించగల సామర్థ్యం ఇప్పటికీ రష్యా వద్దనే ఉంది. యుక్రెయిన్ వద్ద ఉన్న అణ్వాయుధాల్లో కొంత భాగమైనా నియంత్రణ పొందాలని భావించింది. చివరికి 1994లో అమెరికా, యూకే, రష్యా దేశ భద్రతకు హామీ ఇవ్వడంతో ఈ అణ్వాయుధాలను వదులుకుంది. ఈ ఒప్పందాన్ని బుడాపెస్ట్ మెమోరాండం (Budapest Memorandum) అంటారు. దాంతో అణ్వాయుధాలను కోల్పోయింది. అప్పటినుంచి యుక్రెయిన్‌కు స్వతంత్ర ఆయుధాగారం లేదని తేలిపోయింది. కానీ, ఉక్రెయిన్ భూభాగంలో మాజీ సోవియట్ ఆయుధాలను తొలగించడానికి అంగీకరించింది. ఈ విషయంలో యుక్రెయిన్‌కు సాయం చేసేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి తక్షణ చర్య తీసుకోవాలని కూడా ఒప్పందంలో అంగీకరించింది.

Russia Ukraine Conflict Why Did Ukraine Give Up Its Nuclear Weapons In 1990s (1)

Russia Ukraine Conflict Why Did Ukraine Give Up Its Nuclear Weapons In 1990s

మాకు ఆయుధం లేదు.. భద్రత కూడా లేదు : యుక్రెయిన్ అధ్యక్షుడు 
చట్టబద్ధంగా కట్టుబడి ఉండే హామీలు, దండయాత్రల నుంచి బయటపడేందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky), పశ్చిమ దేశాల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఒప్పందంలో భాగంగా ప్రపంచంలోని మూడవ అణు సామర్థ్యాన్ని వదలివేయడానికి యుక్రెయిన్ భద్రతా హామీలను పొందింది. ఈ నెలలోనే మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ప్రసంగంలో యుక్రెయిన్ అధ్యక్షుడు ఇదే అంశంపై ప్రస్తావించారు. తమ దగ్గర ఆయుధం లేదన్నారు. తమకు భద్రత కూడా లేదని వాపోయారు. 2014 ప్రారంభంలో రష్యా దళాలు క్రిమియాపై దాడి చేసి, తూర్పు యుక్రెయిన్‌లో ప్రాక్సీ యుద్ధాన్ని చేశాయి. అయితే పుతిన్ బుడాపెస్ట్ ఒప్పందాన్ని కొట్టిపారేశాడు.

Russia Ukraine Conflict Why Did Ukraine Give Up Its Nuclear Weapons In 1990

Russia Ukraine Conflict Why Did Ukraine Give Up Its Nuclear Weapons In 1990

జూలై 2014లో అల్ట్రా-నేషనలిస్ట్ పార్లమెంటరీ కూటమి ఆయుధాల పునరుద్ధరణ కోసం బిల్లును ప్రవేశపెట్టింది. ఆ ఏడాది తరువాత, అణ్వాయుధ పునర్వ్యవస్థీకరణకు ప్రజల నుంచి ఆమోదం దాదాపు 50 శాతం ఉందని పోల్ ద్వారా తేల్చారు. గత ఏడాదిలో జర్మనీలో యుక్రెయిన్ రాయబారి ఆండ్రీ మెల్నిక్ మాట్లాడుతూ.. కైవ్ NATOలో సభ్యత్వం పొందలేకపోతే అణ్వాయుధాల వైపు ఆలోచించవచ్చునని ఆయన అన్నారు. అయితే మా రక్షణకు మేము ఇంకా ఎలా హామీ ఇవ్వగలమని మెల్నిక్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ.. యుక్రెయిన్ తన అణు ఆయుధాలన్నింటినీ వదులుకున్నందుకు ఎన్నో ఏళ్ల నుంచి ఆందోళన చెందుతూనే ఉంది.

Read Also : Russia-Ukraine War : యుక్రెయిన్ లో ఎటుచూసినా భావోద్వేగ పరిస్థితులు..పిల్లలకు ధైర్యం నూరిపోస్తున్న తల్లిదండ్రులు