Worst Drought In Europe: మండిపోతున్న ఎండలు, ఎండుతున్న నదులు.. ఎన్నడూ లేని విధంగా యూరప్‌లో కరువు విలయతాండవం

యూరప్ లో మాడు పగిలిపోతోంది. ఎండలు మండుతున్నాయి, గొంతులు ఎండుతున్నాయి, చినకు జాడే లేదు. కరువు పడగ విప్పటంతో యూరప్ అల్లాడిపోతోంది. వాతావరణ మార్పులతో యూరప్ లో నదులు ఎండిపోయాయి. గత 50 ఏళ్లలో యూరప్ దేశాల్లో తొలిసారిగా కరువు విలయతాండవం చేస్తోంది.

Worst Drought In Europe: మండిపోతున్న ఎండలు, ఎండుతున్న నదులు.. ఎన్నడూ లేని విధంగా యూరప్‌లో కరువు విలయతాండవం

Worst Drought In Europe: యూరప్ లో మాడు పగిలిపోతోంది. ఎండలు మండుతున్నాయి, గొంతులు ఎండుతున్నాయి, చినకు జాడే లేదు. కరువు పడగ విప్పటంతో యూరప్ అల్లాడిపోతోంది. వాతావరణ మార్పులతో యూరప్ లో నదులు ఎండిపోయాయి. గత 50 ఏళ్లలో యూరప్ దేశాల్లో తొలిసారిగా కరువు విలయతాండవం చేస్తోంది.

అనూహ్య వాతావరణ మార్పులతో, కరువుతో యూరప్ అల్లాడిపోతోంది. బ్రిటన్ తో పాటు ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మన్ దేశాలు కరువుతో విలవిలలాడుతున్నాయి. వాతావరణ మార్పుల అక్కడి నదులు ఎండిపోయాయి. వ్యవసాయం దెబ్బతింది. అడవులు తగలబడిపోతున్నాయి. యూరప్ లోని సగానికిపైగా దేశాల్లో కరువు కల్లోలం రేపుతోంది. ముఖ్యంగా పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్ లో గత రెండు నెలలుగా చుక్క వర్షం లేదు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కరువుతో యూరప్ ఇబ్బందులు పడుతోంది.

ఇంగ్లండ్ లో థేమ్స్ నది ఎండిపోయింది. ఫ్రాన్స్ లో రికార్డు స్థాయి ఎండలకు జనం బెంబేలెత్తుతున్నారు. నదుల్లో నీళ్లు లేక చేపలు చచ్చిపోతున్నాయి. చనిపోయిన చేపలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. స్పెయిన్ లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్ లో సగ భాగాన్ని కరువు కమ్మేస్తోంది.

ఎప్పుడూ కళకళలాడే నదులు ఎండిపోవడంతో ఎండిన ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. సాగు నీరు లేక వ్యవసాయం దెబ్బతింది. పశువులకు మేత లేక పాల దిగుబడి భారీగా పడిపోయింది. చివరికి తాగేందుకు నీరు కూడా లేక ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. ఆహార పదార్ధాలు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీళ్లకూ వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చేసింది.

తీవ్ర కరువు ప్రభావంతో మంచి నీటి సరఫరాపై ఆంక్షలు విధించింది బ్రిటన్. ఈస్ట్ ఆఫ్రికా, పశ్చిమ అమెరికాతో పాటు ఉత్తర మెక్సికోలోనూ దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ లో 46శాతం ప్రాంతాల్లో కరువు పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇందులో 11శాతం ప్రాంతాల్లో అయితే అతి తీవ్ర కరువు నెలకొంది. ఇంగ్లండ్ లో గత నెలలో సగటు వర్షపాతం 35శాతమే నమోదైంది. దీంతో పశువులు తాగే నీళ్లపైనా రోజుకు వంద లీటర్లు అంటూ బ్రిటన్ పరిమితి విధించింది. ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొనడంతో మొక్క జొన్న ఉత్పత్తి 30శాతం, సన్ ఫ్లవర్ ఉత్పత్తి 16లక్షల టన్నులకు తగ్గవచ్చని ఇంగ్లండ్ అంచనా వేసింది.