మంచు తుఫానులో వింతైన ఆడ కుక్కపిల్ల.. రెండు తోకలు, ఆరు కాళ్లతో పుట్టింది!

మంచు తుఫానులో వింతైన ఆడ కుక్కపిల్ల.. రెండు తోకలు, ఆరు కాళ్లతో పుట్టింది!

Six-Legged Miracle Puppy : ఓక్లహోమాలో ఒకవైపు మంచు తుఫాను బీభీత్సం సృష్టిస్తోంది. అదే సమయంలో ఓ కుక్క ఆడ కుక్క పిల్లకు జన్మనిచ్చింది. అది రెండు తోకలు, ఆరు కాళ్లతో జన్మించింది. చూడటానికి వింతగా కనిపిస్తోంది. ఓక్లహోమాలో ఇటీవల మంచు తుఫాను సమయంలో ఈ ఘటన జరిగింది. ఆరు కాళ్లతో జన్మించిన ఈ కుక్కపిల్లకు స్కిప్పర్ అని పేరు పెట్టారు. ఈ వింత కుక్కపిల్ల ఫొటోను ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.

ఓక్లహోమా నగరంలోని నీల్ వెటర్నరీ హాస్పిటల్‌లో స్కిప్పర్‌ కుక్కపిల్లకు మోనోసెఫాలస్ డిపిగస్, మోనోసెఫాలస్ రాచిపాగస్ డైబ్రాచియస్ టెట్రాపస్‌ అనే రెండు పుట్టుకతో వచ్చే రుగ్మతలు ఉన్నాయని వైద్యులు వివరించారు. పుట్టిన వింత కుక్కపిల్లకు ఒకటే తల ఉంది. ఛాతి కూడా ఒకటే.. కానీ, పొత్తి కడుపులు రెండు ఉన్నాయి. 2 తోకలు, 6 కాళ్లను కలిగి ఉంది. స్కిప్పర్‌కు గర్భాశయంలో కవలలు ఉండొచ్చునని వైద్యులు భావిస్తున్నారు.
Six-Legged Miracle Puppy Bornప్రస్తుతానికి పుట్టిన కుక్కపిల్ల ఆరోగ్యంగానే ఉందని, జీవించే ఉందని తెలిపారు. అయితే స్పినా బిఫిడా అనే వెన్నెముక లోపంతో బాధపడుతోందని వైద్యులు చెబుతున్నారు. ఆమె కాళ్లన్నీ సాధారణ కుక్కపిల్లలాగే కదులుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో పెరిగే కొద్ది కుక్కపిల్ల అనేక సమస్యలు ఎదురుకావొచ్చునని, ఫిజియోథెరపీ లేదా ఇతర వైద్య సహాయం అవసరం పడొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.