Suez Canal: కాలువలో షిప్ ఇరుక్కుపోవడం మానవ తప్పిదమే

ఈజిప్ట్ ప్రాంతంలో సూయజ్ కాలువ చీఫ్ శనివారం కీలక విషయం వెల్లడించారు. అలా షిప్ ఆగిపోవడం వెనుక టెక్నికల్ లేదా మానవ తప్పిదం ఉండొచ్చన్నారు. సూయజ్ కెనాల్ అథారిటీ ఒసామా రాబీ..

Suez Canal: కాలువలో షిప్ ఇరుక్కుపోవడం మానవ తప్పిదమే

Suez Canal Chief Cites Possible Human Error In Ship Grounding1

Suez Canal: ఈజిప్ట్ ప్రాంతంలో సూయజ్ కాలువ చీఫ్ శనివారం కీలక విషయం వెల్లడించారు. అలా షిప్ ఆగిపోవడం వెనుక టెక్నికల్ లేదా మానవ తప్పిదం ఉండొచ్చన్నారు. సూయజ్ కెనాల్ అథారిటీ ఒసామా రాబీ రిపోర్టల్తో మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి కల్లా షిప్ ను యథాస్థానంలోకి తీస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు.

కాలువలో షిప్ ఇరుక్కుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కనిపించనుంది. ఈ సమస్యను అధిగమించడానికి షిప్ లు తప్పనిపరిస్థితుల్లో ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తూ ఎక్కువ ఖర్చుపెడుతున్నాయి. అధికారులు ముందుగా ఇసుక తుఫాను దీనికి కారణం అయి ఉండొచ్చని అన్నారు.

కానీ, ర్యాబీ శనివారం మాట్లాడుతూ.. పెనుగాలులు, వాతావరణ ప్రభావం మాత్రమే దీనికి బాధ్యులు కాదని టెక్నికల్ లేదా మానవ తప్పిదాలు ఉండొచ్చు. ఆదివారం నాటికి షిప్ యథాస్థానానికి తీసుకెళ్తాం.

320 షిప్పులకు పైగా బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఆసియా నుంచి యూరప్ కు తీసుకెళ్తున్నాయి. 120మైళ్ల పొడవున్న కాలువపై జరుగుతున్న ప్రయాణం 12రోజుల్లో ముగియాల్సి ఉంది. ఈజిప్టు సమీపంలో మద్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలిపే ఈ సూయజ్ కాలువ 193 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మార్చి 23 నుంచి ఈ జలమార్గం మూతపడింది. ఆసియా, ఐరోపా దేశాల మధ్య నౌక రవాణా వేగవంతంగా జరిగే మార్గమిది.