వచ్చే 30 ఏళ్లలో సూర్యుడు 7 శాతం శక్తిని ఎందుకు కోల్పోతాడు.. మినీ మంచు యుగానికి సంకేతమా?

వచ్చే 30 ఏళ్లలో సూర్యుడు 7 శాతం శక్తిని ఎందుకు కోల్పోతాడు.. మినీ మంచు యుగానికి సంకేతమా?

Sun will lose 7 percent of power in about 30 years : సూర్యుని శక్తి అంతరించిపోతుందా? సుమారుగా 30ఏళ్లలో సూర్యుడు 7 శాతం శక్తిని ఎందుకు కోల్పోతాడు? ఇది మినీ మంచు యుగానికి సంకేతామా? అంటే అందుకు అవకాశముందని కొత్త సైంటిఫిక్ అధ్యయననం చెబుతోంది. దీనికి సౌర గ్రౌండ్ మినిమమ్ అనే పేరుతో అధ్యయనాన్ని ప్రచురించారు. సూర్యునిలో ఉండే అయస్కాంత శక్తి తగ్గిపోతుండటాన్ని సన్ స్పాట్ అని పిలుస్తారు. తరచుగా చాలా తక్కువగా ఇది జరుగుతుంటుంది. తద్వారా తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాలు భూమిపై ప్రసరిస్తాయి. ఎందుకిలా జరుగుతుందంటే? సూర్యుని అయస్కాంత క్షేత్రంలో జరిగే హెచ్చుతగ్గుల కారణంగా అని అధ్యయనంలో వెల్లడైంది.

దీని కారణంగానే భూమి అసాధరమైన స్థితిలో చల్లని ఉష్ణోగత్రలు చోటుచేసుకుంటాయని పేర్కొంది. సూర్యుడు శక్తిని కోల్పోవడం ద్వారా భూమిపై మసకగా కనిపిస్తుంటాడు. సూర్యుడు 11 ఏళ్ల హెచ్చుతగ్గుల కాలచక్రంలో ఉన్నాడు. కానీ, ప్రత్యేకించి గ్రాండ్ మినిమమ్ సమయంలో మాత్రం చాలా చల్లగా ఉంటుంది. అప్పుడు సూర్యుని కాంతి వేడి సాధారణం కంటే 11ఏళ్ల కనిష్టానికి తక్కువగా నమోదు అవుతుంది. ఫలితంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో చల్లటి ఉష్ణోగ్రతల ఏర్పడటానికి దారితీస్తుంది.

గత గ్రాండ్ మినిమమ్ కాలంలో సన్ స్పాట్ తగ్గినప్పటి అధ్యయనం ఆధారంగా చల్లటి ఉష్ణోగత్రల ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. అప్పుడు సూర్యుని కాంతి లేదా సూర్య రశ్మి, వేడి 7 శాతం మేర తగ్గడానికి చూడొచ్చు. సాధారణంగా 11ఏళ్ల కాలచక్రంలో 7 శాతం కంటే తక్కువగా నమోదు కావడం సర్వసాధారణమే. గ్రాండ్ మినిమమ్ అనేది.. 17వ శతాబ్దపు మధ్యయుగంలో జరిగింది. దీన్ని అప్పుడు మౌండర్ మినిమమ్ గా పిలిచారు. ఈ సమయంలో నదులన్నీ గడ్డుకట్టిపోతాయి.. బాల్టిక్ సముద్రం కూడా మంచులా మారిపోయింది. అదే సమయంలో స్వీడన్ ఆర్మీ మంచుగడ్డలపై మార్చింగ్ చేసేందుకు వీలు కల్పించింది.

అప్పుడు అలాస్కా, దక్షిణ గ్రీన్ ల్యాండ్ లో వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓజోన్ పొర సన్నబడటం వల్ల ప్రపంచమంతా వాతావరణం వేడిక్కి వేడిగాలులకు దారితీసింది. ఈ మార్పులకు సంబంధించి ఖచ్చితమైన తేదీ తీవ్రత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. కానీ, వచ్చే 2050లో ఇలాంటి పరిస్థితి మళ్లీ జరగొచ్చునని అంచనాలు నెలకొన్నాయి. కొన్ని అంచనాల ప్రకారం.. 2030 నాటికి సూర్యునిలో అయస్కాంత శక్తిని కోల్పోవడం మొదలవుతుందని అంచనా. గ్లోబల్ వార్మింగ్ నుండి మనల్ని కాపాడుతుందా? అంటే శాస్త్రవేత్తలు అదేం లేదంటున్నారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత పెరగడం కారణంగా వాతావరణం వేడెక్కుతుందని, తద్వారా కొంత భాగం మాత్రమే శీతలీకరణ ప్రభావం ఉంటుందని అధ్యయనం తెలిపింది.