Kid Poem ‘smelly dad’ : మా నాన్న ఫైజర్..ఎప్పుడు వాడడు రేజర్,మా నాన్న బొడ్డు కంపు : ఐదేళ్ల చిన్నారి కవిత వైరల్

ఓ చిన్నారి తండ్రి గురించి రాసిన కవిత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా నాన్న ఫైజర్, ఎప్పుడు వాడడు రేజర్,మానాన్నకు ఉంది పెద్ద బొడ్డు అది ఎప్పుడు వస్తుంది కంపు, ఐ లవ్యూయూ డాడ్..

Kid Poem ‘smelly dad’ : మా నాన్న ఫైజర్..ఎప్పుడు వాడడు రేజర్,మా నాన్న బొడ్డు కంపు : ఐదేళ్ల చిన్నారి కవిత వైరల్

‘smelly Dad’  Big Belly Very Smelly

‘smelly dad’  Big belly very smelly : పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులకు ముద్దే. వారి అల్లరి, ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతుంటారు.నా బంగారు కొండ అంటూ బుగ్గలు నిమిరి సంతోషపడిపోతుంటారు. చిన్నారులు గోడలమీదా..కాగితాలమీదా పిచ్చి గీతలు వేసినా..నా బంగారం ఎంతగా బొమ్మలు వేసిందో అంటూ మెచ్చుకుంటారు. అటువంటిది నాలుగు అక్షరాలు రాస్తే ‘ నా చిట్టితల్లి గొప్పదైపోయిదే’అంటూ ఆనందపడిపోతారు.అటువంటిది తమ ఐదేళ్ల గారాల పట్టి రాసిన ఓ కవిత రాస్తే ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందో ఊహించలేం.

Read more : Toothbrush Sculpture : 80,000 టూత్‌ బ్రష్‌లతో ఫాస్ట్‌మినార్‌.. గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన డాక్టర్‌ రెడ్డీస్‌

అదిగో అచ్చు అటువంటిదే ఈ కవిత. ఐదేళ్ల చిన్నారి తన తండ్రి గురించి రాసిన కవిత సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిన్నపిల్లే అయినా రైమింగ్ పై పట్టు ఉన్నట్లు ఎక్కడా రైమింగ్ మిస్ అవ్వకుండా రాసిందా చిన్నారి.‘ఐ ల‌వ్ మై డ్యాడ్ అంటూ క‌విత‌ను ముగించేసిన చిన్నారి కవిత చదివితే మీరు కూడా అంటారు ఈమె చిన్నపిల్లా అక్షరాలతో ఆటలాడుకున్న చిచ్చరపిడుగా అని.

Read more : Nusret Gokse Salt Bae Bill : సింగిల్‌ మీల్‌ రూ.1,80,000..అయినా ఆ రెస్టారెంటుకు క్యూ కడుతున్న కష్టమర్లు..ఎందుకంటే..

ఈ కవితలో ఆ చిన్నారి ‘నా నాన్న ఫైజర్ అతను ఎప్పుడు వాడడు రేజర్ అంటూ స్టార్ట్ చేసింది. మానాన్నకు గడ్డం ఉంది. మా నాన్నకు తల బంతిలా ఉంటుంది.అతనికి విగ్ అవసరమని నేను అనుకుంటున్నా..మా నాన్నకు పెద్ద బొడ్డు ఉంది అది దుర్వాసన వస్తుంది’ అంటూ ఆ చిన్నారి రాసిన క‌విత‌ని త‌ల్లి సోషల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అయింది. ఈ క‌విత‌ను మీరు కూడా చదవండీ తప్పకుండా నవ్వుకుని తీరుతారని బెట్..మరి చదివేయండీ..ఆ చిన్నారి రైమింగ్ కవితని..

My dad is called Frazer; he never uses a razor.

He has a beard and he is really weird.

My dad is really small and his head is like a ball.

His ears are big and I think he needs a wig.

My dad is crazy and in the mornings he is lazy.

He has a big belly and is very smelly.”

“I love my dad, he’s a lovely lad.”