Liz Truss: సంపన్నుల విషయంలో యూటర్న్ తీసుకున్న ప్రధానమంత్రి

మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే బ్రిటన్‌ పౌండ్‌ విలువ భారీగా పతనమైంది. దీంతో ఇంగ్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రంగంలోకి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను కోత ప్రణాళికను ప్రకటించడం పట్ల ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి

Liz Truss: సంపన్నుల విషయంలో యూటర్న్ తీసుకున్న ప్రధానమంత్రి

Truss forced into U-turn on tax after week of market turmoil

Liz Truss: ఎన్నికలకు ముందు ఇష్టారీతిన హామీలివ్వడం అధికారంలోకి రాగానే మాట తప్పడం.. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అలవాటే ఇది. కొద్ది రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన లిజ్ ట్రస్ కూడా ఆ కోవలోకే వస్తారని చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు విస్తృతంగా ప్రచారం చేస్తున్న పదే పదే చెప్పుకొచ్చిన ఒక హామీని అమలు చేసినట్టే చేసి కేవలం పదే పది రోజుల్లో యూటర్న్ తీసుకున్నారు. సంపన్నులకు దాయాపు పన్ను కోత విధించాలన్న నిర్ణయంపై ఆమె వెనక్కి తగ్గారు.

సంపన్నులకు పన్నుల్లో రాయితీ కల్పిస్తామని ప్రధాని పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చిన ఆమె.. అందుకు అనుగుణంగా 10 రోజుల క్రితం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌లో దానికి సంబంధించిన ప్రకటన చేశారు. అయితే, మార్కెట్‌ ఒడుదొడుకులు, అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం 10 రోజుల క్రితం మినీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. అందులో అధికాదాయం కలిగిన సంపన్నులకు ఆదాయపు పన్నులో 45 శాతం మేర కోత విధిస్తామని ప్రకటించారు.

వచ్చే ఏప్రిల్‌ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఛాన్సలర్‌ క్వాసీ క్వార్టెంగ్‌ బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించారు. అయితే, మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే బ్రిటన్‌ పౌండ్‌ విలువ భారీగా పతనమైంది. దీంతో ఇంగ్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రంగంలోకి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను కోత ప్రణాళికను ప్రకటించడం పట్ల ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ నేతల నుంచీ వ్యతిరేకత రావడంతో పన్ను కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఛాన్సలర్‌ క్వాసీ క్వార్టెంట్‌ కీలక ప్రకటన చేశారు. ప్రజల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

Andheri East By Poll: శివసేన చీలిపోయిన అనంతరం షిండే-ఉద్ధవ్‭లకు తొలి పరీక్ష