Cheapest Electric Car : ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.. త్వరలో విడుదల

ఎంజీ మోటార్స్ ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మన దేశంలోనూ త్వరలో లాంచ్ చేయనుంది.

Cheapest Electric Car : ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.. త్వరలో విడుదల

Cheapest Electric Car

Updated On : March 14, 2022 / 9:52 PM IST

Cheapest Electric Car : ఎంజీ మోటార్స్ ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మన దేశంలోనూ త్వరలో లాంచ్ చేయనుంది. దీని ధర రూ.10లక్షల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎంజీ నుంచి వస్తున్న ఈ కారుకి కేవలం రెండు డోర్స్ మాత్రమే ఉండనున్నాయి. చైనాకు చెందిన వులింగ్ గ్లోబల్ కంపెనీతో కలిసి ఈ కారును ఎంజీ మోటార్స్ విడుదల చేయనుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది.

Nokia Flagship Phones : నోకియా ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలికినట్టేనా?!

వులింగ్‌ కంపెనీకి చెందిన హాంగ్‌గ్వాంగ్‌ మినీ ఈవీను పోలిన ఈ కారులో 20కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ కారు వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం భారత్‌లో చౌకైన ఎలక్ట్రిక్‌ కారుగా టాటా టిగోర్‌ ఈవీ ఉంది. దీని ధర రూ.11.99లక్షలు ఉంది.

New Smartphones: మార్కెట్లో కొత్త ఫోన్ల సందడి: ఐఫోన్, శాంసంగ్, రెడ్మి నుంచి కొత్త ఫోన్లు

అంతర్జాతీయంగా చమురు ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. వాటి ధరలు వాహనదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. బండితో రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు.. ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్ లు, కార్ల తయారు చేసే పనిలో పడ్డాయి. ఇక ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ ఎంజీ మోటార్స్‌.. ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయనుంది.