తండ్రి ఆఖరి కోరిక : నా అస్థికలను బీరులో కలిపి అక్కడి డ్రైనేజీలో పొయ్యండీ..

10TV Telugu News

son pours father’s ashes in drain outside pub : ఓ తండ్రి అయినా తాను చనిపోయాక తన అస్థికలను పవిత్రమైన నదుల్లో కలపాలని కోరతాడు. కానీ ఎప్పుడూ ఎక్కడా విననటువంటి వింత కోరిక కోరాడో తండ్రి. తాను చనిపోయాక తన సాగరం (సముద్రం)లోనే లేకా నదుల్లోనో..లేదా నదుల సంగమంలోనో కలపాలని కోరలేదు. తన అస్థికలను బీరులో కలిపి..డ్రైనేజీలో కలపాలని కోరాడు. వినటానికి ఇది వింతగా..పిచ్చిగా ఉన్నా అతని కోరిక అదే..తండ్రి కోరిన విన్న ఆ పిల్లలు కూడా ఆ తండ్రి ‘ఆఖరి కోరిక’ను నెరవేర్చారు.


యూకేలోని కోవెంట్రీకి చెందిన కెవిన్ మెక్‌గ్లించే అనే వ్యక్తి చనిపోతూ తన కొడుకును ఈ వింత కోరిక కోరాడు. తాను మరణించిన తర్వాత ఆస్థికలను తనకు ఎంతో ఇష్టమైన హోలీబుష్‌ పబ్‌కు తీసుకెళ్లాలని.. వాటిని బీరులో కలిపాలని.. ఆ తర్వాత ఆ బీరును పబ్ ముందున్న డ్రైనేజీలో కలపాలని కోరాడు. ఆ తరువాత కొంతకాలానికే కెవిన్ చనిపోయాడు.

ఆ తరువాత కెవిన్ పుట్టిన రోజున అతని కొడుకు ఒవెన్, కూతురు కాస్సిడేలు కలిసి తండ్రి చెప్పిన హోలీబుష్‌ పబ్‌కు వెళ్లారు. తండ్రి చెప్పినట్లే అక్కడి బీరులో అస్థికలను కలిపి..ఆ తర్వాత ఆ బీరును పబ్ ముందున్న డ్రైనేజీలో కలిపారు. ‘నాన్నా..నువ్వు చెప్పినట్లే చేశాం..హ్యాపీనా’ అంటూ పైలోకంలో ఉండే తండ్రికి చెప్పారు.

 


తండ్రి కోరినట్లే చేసిన ఓవెన్ మాట్లాడుతూ.. ‘‘ఇది కొంచెం పిచ్చిగానే అనిపించవచ్చు. ఇది నా తండ్రి ఆఖరి కోరిక. అలా చేయక తప్పలేదు. ఆయన కోరిన కోరిక తీరిస్తే ఆయన ఎప్పుడు మాతోనే ఉంటారనే నమ్మకం మాది. ఆయన ఎప్పుడూ తన అస్థికలను పబ్‌ డ్రైనేజీలోనే కలపాలని కోరేవాడు. కానీ మొదట్లో తాము ఇదేంటీ నాన్నా ఇదేం కోరిక అని అడిగితే..తాను మాత్రం సీరియస్ గా నేను చెప్పినట్లే చేయండి అని పదే పదే కోరేవారు. అందుకే, ఇలా చేయాల్సి వచ్చింది’’ అని తెలిపాడు.

అంతేకాదు.. కెవిన్ మరో వింత కోరిక కూడా కోరాడు. చనిపోయిన తర్వాత తన తల వెంటుకలను కూడా పబ్‌ డ్రైనేజీలో కలపాలని తెలిపాడు. అతడు చెప్పినట్లే అతడి కొడుకు, కూతురు అస్థికలతోపాటు కలిపారు. అలా తండ్రి కోరికలు వాళ్లిద్దరూ కలిసి నెరవేర్చారు..