Volodymyr Zelenskyy: నాటో సభలో ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‭స్కీ.. మీమ్స్‭తో ఓ ఆట ఆడుకుంటున్న నెటిజెన్లు

వీలైనంత త్వరగా నాటోలో ఉక్రెయిన్ చేరాలని కోరుకుంటుంది. అయితే ఆ చర్యపై వివిధ దేశాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. నాటోలో ఉక్రెయిన్ కనుక చేరితో రష్యాతో యుద్ధానికి కారణం అవుతుందని కొన్ని సభ్య దేశాలు భయపడుతున్నాయి

Volodymyr Zelenskyy: నాటో సభలో ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‭స్కీ.. మీమ్స్‭తో ఓ ఆట ఆడుకుంటున్న నెటిజెన్లు

Updated On : July 13, 2023 / 5:01 PM IST

NATO Summit: నాటో సమావేశంలో వివిధ దేశాధినేతలు మాట్లాడుతుండగా.. ఒంటరిగా ఉన్న ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‭స్కీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు ఈ ఫొటోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ జోకులు, ట్రోల్స్ వేస్తున్నారు. దేశాధినేతలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా బిజీగా ఉండగా.. జెలెన్‭స్కీ మాత్రం ఒంటరిగా నిలబడ్డారు. ఆయనను ఎవరూ పట్టించుకోనట్టుగా ఆ ఫొటో ఉంది. దీంతో నెటిజెన్లకు మీమ్స్ పండగ ఏర్పడింది.

Wagner Boss: రష్యా అధ్యక్షుడు పుతిన్‭పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్‭ను హతమార్చారా? అమెరికా సైనిక అధికారి సంచలన వ్యాఖ్యలు

ఇక ఆ సమయంలో జెలెన్‭స్కీ ముఖ కవళికల్ని బట్టి మీమ్స్ వేస్తున్నారు. ఆకుపచ్చ మిలిటరీ బట్టల్లో ఉన్న జెలెన్‭స్కీ పెదవి కొరుకుతూ దీర్ఘంగా మిగతా దేశాధినేతలవైపు చూస్తున్నారు. తన ముఖంపై భయంకరమైన వ్యక్తీకరణతో ఒంటరిగా నిలబడి, ఏదో ఆలోచిస్తూ కనిపించాడు. ఏ పరిస్థితులలో ఈ ఫొటో క్లిక్ చేశారో ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ.. ఇది ఇప్పుడు ఐరోపాలో ఉక్రెయిన్ రాజకీయ పరిస్థితిని అద్దం పడుతోందని అంటున్నారు.

Mr Pregnant : ప్రెగ్నెంట్‌ అయిన బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్‌.. డెలివ‌రీ ఆగ‌స్ట్ 18..బేబీ 90 ప‌ర్సెంట్ లోడింగ్‌

వీలైనంత త్వరగా నాటోలో ఉక్రెయిన్ చేరాలని కోరుకుంటుంది. అయితే ఆ చర్యపై వివిధ దేశాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. నాటోలో ఉక్రెయిన్ కనుక చేరితో రష్యాతో యుద్ధానికి కారణం అవుతుందని కొన్ని సభ్య దేశాలు భయపడుతున్నాయి. ఇకపోతే.. వైరల్ చిత్రం ఆన్‌లైన్‌లో అనేక కామెంట్లు, మీమ్‌ల వర్షం కురిపిస్తోంది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన వారిలో జర్నలిస్ట్ సైమన్ అటెబా కూడా ఉండడం విశేషం. ఈ ఫొటోను ఆయన షేర్ చేస్తూ “ఈ చిత్రం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఎందుకో ఎవరైనా చెప్పగలరా?” అని ట్వీట్ చేశారు.