Wagner Boss: రష్యా అధ్యక్షుడు పుతిన్‭పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్‭ను హతమార్చారా? అమెరికా సైనిక అధికారి సంచలన వ్యాఖ్యలు

ఈ వారం ప్రారంభంలో ప్రిగోజిన్, అతని వ్యక్తులు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారని, సాయుధ తిరుగుబాటు జరిగిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వానికి విధేయత చూపారని రష్యా తెలిపింది

Wagner Boss: రష్యా అధ్యక్షుడు పుతిన్‭పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్‭ను హతమార్చారా? అమెరికా సైనిక అధికారి సంచలన వ్యాఖ్యలు

Updated On : July 13, 2023 / 3:27 PM IST

Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు చేసి, అనంతరం లొంగిపోయిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ కనిపించకపోవడంపై అమెరికా మాజీ సైనిక అదికారి రాబర్ట్ అబ్రమ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యెవ్జెనీ అయితే చనిపోయి ఉండాలి, లేదంటే జైలులో అయినా ఉండాలి అని ఆయన అన్నారు. తిరుగుబాటు జరిగిన ఐదు రోజుల తర్వాత మెర్సెనరీ గ్రూప్ చీఫ్‌ను పుతిన్ కలిశారని రష్యా నుంచి ప్రకటన వచ్చిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Yamuna River: యమునా మహోగ్రరూపం.. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి మట్టం.. ఢిల్లీ సీఎం ఇంటి సమీపంలోకి వరద

తాజాగా మీడియాతో అమెరికా మాజీ జనరల్ రాబర్ట్ అబ్రమ్స్ మాట్లాడుతూ, పుతిన్, యెవ్జెనీ మధ్య జరిగిన సమావేశం కూడా ఎజెండా ప్రకారమే జరిగిందని ఆయన అన్నారు. “నా వ్యక్తిగత అంచనా ఏమిటంటే, మనం ప్రిగోజిన్‌ని మళ్లీ బహిరంగంగా చూస్తామా అనే సందేహం ఉంది. ఆయనను అజ్ఞాతంలో ఉంచారా లేదా జైలుకు పంపారా లేదా మరే విధంగానైనా వ్యవహరించారోనని నేను అనుకుంటున్నాను. మనం ఆయనను మళ్లీ చూస్తామా అనేది మాత్రం నాకు అనుమానంగానే అనిపిస్తోంది’’ అని అన్నారు.

Multiplex Food : GST తగ్గింది.. మరి మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ రేట్లు తగ్గుతాయా?

ప్రిగోజిన్ ఇంకా బతికే ఉన్నాడని మీరు అనుకుంటున్నారా అని అడిగినప్పుడు, జనరల్ అబ్రమ్స్ స్పందిస్తూ “జైలులో ఉన్నారేమో, లేదంటే మరింకేదైనా జరిగి ఉండొచ్చు’’ అని సమాధానం ఇచ్చారు. ఈ వారం ప్రారంభంలో ప్రిగోజిన్, అతని వ్యక్తులు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారని, సాయుధ తిరుగుబాటు జరిగిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వానికి విధేయత చూపారని రష్యా తెలిపింది. మూడు గంటల సమావేశం జూన్ 29న జరిగింది. ప్రిగోజిన్ మాత్రమే కాకుండా అతని వాగ్నర్ గ్రూప్ మిలిటరీ కాంట్రాక్టర్ నుంచి కమాండర్లు పాల్గొన్నారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు.

Bihar: టీచర్ల పోస్టింగుపై నిరసన చేస్తుండగా పోలీసుల లాఠీచార్జ్‭.. బీజేపీ నాయకుడు మృతి

మిలిటరీ నాయకత్వ మార్పును కోరుతూ గత నెలలో మాస్కోకు మార్చ్‌లో దళాలకు నాయకత్వం వహించిన ప్రిగోజిన్‌తో పుతిన్ ముఖాముఖిగా సమావేశమయ్యారని చెప్పడంపై అనుమానాలు వస్తున్నాయి. తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్‌ను దేశద్రోహిగా ముద్రవేసి, కఠిన శిక్ష విధిస్తానని పుతిన్ ప్రమాణం చేశారు. అయితే అదే తిరుగుబాటు సైనికాధికారిపై ఉన్న క్రిమినల్ కేసులను తర్వాత తొలగించడం గమనార్హం.