Bihar: టీచర్ల పోస్టింగుపై నిరసన చేస్తుండగా పోలీసుల లాఠీచార్జ్‭.. బీజేపీ నాయకుడు మృతి

వచ్చే వారం సెలవులపై విద్యాశాఖ అధికారులకు సెలవులను నిషేధిస్తూ బీహార్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారుల లీవ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

Bihar: టీచర్ల పోస్టింగుపై నిరసన చేస్తుండగా పోలీసుల లాఠీచార్జ్‭.. బీజేపీ నాయకుడు మృతి

Updated On : July 13, 2023 / 3:09 PM IST

Vijay Kumar Singh: బీహార్‌ రాష్ట్రంలో టీచర్ల పోస్టింగ్‌పై ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పాట్నా పోలీసులు లాఠీచార్జి చేయడంతో భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకుడు మరణించాడు. పాట్నాలోని డక్‌బంగ్లా చౌరాహాలో జరిగిన లాఠీచార్జిలో విజయ్ కుమార్ సింగ్ అనే బీజేపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డాడు అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

Woman Slaps MLA : ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకంటే..?

కాగా, ఈ ఘటనపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా ఇతర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదట ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ ధృవీకరించారు. ఆయన తన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ ‘’విధానసభ మార్చ్’ చేస్తుండగా బీజేపీ నేతలపై లాఠీచార్జి జరిగింది. బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు మరణించాడు’’ అని ట్వీట్ చేశారు.

Alternative To Tomatoes : టమాటాలకు బదులు ఇవి వాడుకోండి .. వంటకాలకు రుచికి రుచీ..డబ్బు కూడా ఆదా..

పాట్నాలో బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి జరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అసమర్థత వల్లనే అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఈ ఘటనపై ఆయన తన ట్విటర్‌లో స్పందిస్తూ.. “అవినీతి కోటను కాపాడేందుకు మహాఘటబంధన్ (మహాకూటమి) ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని రక్షించడానికి బీహార్ ముఖ్యమంత్రి తన స్వంత నైతికతను మరచిపోయారు” అని నడ్డా హిందీలో ట్వీట్ చేశారు.

Bihar : రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన కుర్రాడు అరెస్ట్ .. జీవితాలు పణంగా పెట్టొదంటూ RPF ట్వీట్

వచ్చే వారం సెలవులపై విద్యాశాఖ అధికారులకు సెలవులను నిషేధిస్తూ బీహార్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారుల లీవ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రత్యేక పరిస్థితుల్లో సెలవులు పొందేందుకు విద్యా శాఖ అధికారులు డిప్యూటీ సెక్రటరీ కెకె పాఠక్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొన్నారు.