Woman Slaps MLA : ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకంటే..?
ఓ ఎమ్మెల్యే చెంప ఛెళ్లు మనిపించింది ఓ మహిళ. ఊహించని ఈ ఘనటకు ఆ ఎమ్మెల్యే బిత్తరపోయాడు. ఆనక తేరుకుని..

Haryana Woman Slaps JJP MLA
Haryana Woman Slaps JJP MLA : అతనో ఎమ్మెల్యే. ఆయన చెంప ఛెళ్లు మనిపించింది ఓ మహిళ. ఊహించని ఈ ఘనటకు పాపం ఆ ఎమ్మెల్యే బిత్తరపోయాడు. ఆనక తేరుకుని స్థానికుల యోగక్షేమాలు అడిగాడు. పోనీలే పాపం వారు కష్టాల్లో ఉన్నారు కదా..ఆ మాత్రం కోపం ఉంటుందిలే..నా చెంపమీద కొట్టిన ఆ మహిళను క్షమించేశాను అంటూ చెప్పుకొచ్చారు సరదు ఎమ్మెల్యే..ఎవరా ఎమ్మెల్యే..ఎక్కడ జరిగిందా ఘటన..ఆమె ఎందుకు ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ధైర్యంగా చెంప చెళ్లు మనించిందీ అంటే..
ఇటీవల కొన్ని రోజులుగా హర్యానా(Haryana)లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవన అస్తవ్యస్థమంగా మారిపోయింది. వర్షాలు, వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈక్రమంలో వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓట్ల కోసం వస్తారు గానీ ప్రజలు వరదలతో కష్టాలు పడుతుంటే ఏ ఒక్క ప్రజా ప్రతినిధి రాలేదను ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అదే సమయంలో జననాయక్ జనతా పార్టీ (Jannayak Janta Party(JJP) )ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ (MLA Ishwar Singh)ఆ ప్రాంతాన్ని పరిశీలించటానికి వచ్చారు.అంతే అతనిని చూసిన ఓ మహిళ కోపంతో ఊగిపోయింది. ఇన్ని రోజులుగా మేం తిండీ తిప్పలు లేకుండా చిన్నపిల్లలు కూడా నానా కష్టాలు పడుతుంటే ఇప్పుడా వచ్చేది అంటూ సదరు ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనింపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Lucknow Royal Saree : ఈ చీర ధర అక్షరాలా రూ.21.9 లక్షలు..! ప్రత్యేకతలు ఇవే..
హర్యానా(Haryana)లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు పోటెత్తించిది. ఈ ప్రభావం ఘగ్గర్ నదిపై ఉన్న చిన్న డ్యామ్ పై పడింది. నీటి తీవ్రత పెరగటంతో డ్యామ్ దెబ్బతింది. ఘలా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. పరిస్థితిని సమీక్షించేందుకు ఎమ్మెల్యే బుధవారం (జులై 12,2023) ఆ ప్రాంతానికి వచ్చారు. దీంతో స్థానికులంతా ఆయన్ని చుట్టుముట్టారు. సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు. దీనికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడుతు ఓ మహిళ అకస్మాత్తుగా ముందుకు దూసుకొచ్చి..ఎమ్మెల్యేను ‘ఇప్పుడెందుకు వచ్చావ్..(Why Have You Come Now?)?’ అని ఆగ్రహం వ్యక్తంచేస్తు ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే చుట్టూ రక్షణగా నిలిచారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ మాట్లాడుతు..‘‘అది ఓ ప్రకృతి విపత్తని నచ్చజెప్పేందుకు నేను ప్రయత్నించానని కానీ వర్షాలు భారీగా కురుస్తుండంతో వెంటనే చర్యలు తీసుకోలేకపోయామని చెప్పేందుకు యత్నించినా వినలేదు..కానీ స్థానికులు వినే పరిస్థితిలో లేరు..తనను కొట్టిన ఆమెనుక్షమించాను..ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోను’ అని తెలిపారు.