‘Baby Factory’: సరోగసీ వ్యాపారం..రూ.40 లక్షలకు పసికందుల అమ్మకం..

మాతృత్వం వ్యాపారం అయిపోయింది. కాసుల కోసం కన్నపేగును అమ్మేసుకుంటున్నారు. కూరగాయలు అమ్మినట్లుగా పురిటిలో బిడ్డలను అమ్మేసుకుంటున్నారు.బిడ్డల్ని కనే కర్మాగారంగా మారిపోతున్నాయి మహిళలకు గర్బసంచులు. కన్నబిడ్డలనే అమ్మేసుకునే దారుణాతిదారుణమైన వ్యాపారాలు జరిగిపోతున్నాయి ఉక్రెయిన్ దేశంలో.

‘Baby Factory’: సరోగసీ వ్యాపారం..రూ.40 లక్షలకు పసికందుల అమ్మకం..

Commercial Surrogacy In Ukraine

Commercial Surrogacy in Ukraine: మాతృత్వం వ్యాపారం అయిపోయింది. కాసుల కోసం కన్నపేగును అమ్మేసుకుంటున్నారు. కూరగాయలు అమ్మినట్లుగా పురిటిలో బిడ్డలను అమ్మేసుకుంటున్నారు.బిడ్డల్ని కనే కర్మాగారంగా మారిపోతున్నాయి మహిళలకు గర్బసంచులు. కన్నబిడ్డలనే అమ్మేసుకునే దారుణాతిదారుణమైన వ్యాపారాలు జరిగిపోతున్నాయి ఉక్రెయిన్ దేశంలో.

ఉక్రెయిన్ లో కమర్షియల్‌ సరోగసీ పరిశ్రమ బాగా పెరిగిపోయింది. సరోగసీ ద్వారా పుట్టే పిల్లలు బాగా పెరుగుతున్నారు. దీంతో సరోగసీ ద్వారా జన్మించిన పిల్లలను కూరగాయల్లా అమ్మేస్తున్నారు. ఈ పద్ధతిని ‘బేబీ ఫ్యాక్టరీ’ అని పిలుస్తున్నారు ఉక్రెయిన్ లో. సొంతంగా బిడ్డలను కనలేనివారంతా ఉక్రెయిన్‌కు వెళ్లి..పిల్లలను కొనుక్కుని తెచ్చేసుకుంటున్నారు. ఈ అమ్మకాలు ఏదో చాటుమాటులగా జరుగుతున్నాయనుకోవటానికి లేదు. అది చట్టబద్ధం కాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంలో కమర్షియల్‌ సరోగసీ పరిశ్రమ బాగా వృద్ధి చెందింది. సరోగసీ ద్వారా జన్మించే పిల్లల సంఖ్య సైతం బాగా పెరిగింది. దీంతో సరోగసీ ద్వారా జన్మించిన పిల్లలను అమ్మడం ప్రారంభించారు.

ఈ దేశంలో ప్రతీ సంత్సరం సరోగసీ ద్వారా 2500 నుంచి 3000 మంది పిల్లలు జన్మిస్తున్నారు. అంటే ఇది ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. సరొగేట్ మదర్ కోసం ఇతర దేశాల వారు ఉక్రెయిన్ వెళుతున్నరంటే ఇక్క కన్నపేగుల అమ్మకాలు ఎంత భారీ సంఖ్యలో జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. ఈ బేబీ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ వినియోగదారుల్లో మూడు వంతులమంది చైనీయులే కావటం గమనించాల్సిన విషయం. భారత్, థాయ్ లాండ్ దేశాలు విదేశీయులకు కమర్షియల్ సరోగసీని నిషేధించిన తర్వాత.. ఉక్రెయిన్ దాన్ని బాగా ఉపయోగించుకున్నట్లుగా ఉంది. గ్లోబల్ కమర్షియల్ సరోగసీ మార్కెట్ ఇప్పుడు ఐదు బిలియన్ యురోలకు చేరుకున్నట్లుగా అంచనాలున్నాయి.

ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం హోమోసెక్సువల్ జంటలు అయితే..వారు అప్పటికే వివాహం చేసుకొని ఉండాలి. వంధత్వ నిర్ధారణకు సంబంధించిన అన్ని ఆధారాలు కచ్చితంగా ఉండాలి. ఉక్రెయిన్‌లో సరోగేట్ గర్భం ధర 25,000 యూరోల అంటే మన భారత కరెన్సీ లెక్కన రూ.22 లక్షలు నుంచి 70,000 యూరోలు అంటే రూ.61 లక్షల మధ్య ఉంటుంది. దేశంలో సగం వరకు సరోగసీ గర్భాలు దీని కోసం రూ.39 వేల యూరోలు(దాదాపుగా రూ.35 లక్షలు) వసూలు చేస్తున్నాయని బయోటెక్స్ కామ్ అనే కైవ్ ఆధారిత సరోగసి క్లినిక్ వెల్లడించింది. శిశువు లింగాన్ని (ఆడా-మగా) కూడా ఎంచుకోవాలంటే ధరల్లో తేడాలుంటాయి. 49,900 యూరోల(రూ.43.95 లక్షలు)కు పెరుగుతుంది. అపరిమిత ప్రయత్నాలకు అయితే ఈ ఖర్చు 64,900 యూరోలు అంటే రూ.57 లక్షలు ఉంటుంది.

ఈ పరిశ్రమ (బేబీ ఫ్యాక్టరీ) ఎంతోమంది తల్లిదండ్రులకు కొత్త ఆశలు కల్పిస్తోంది. కానీ వారి కల నెరవేర్చే ప్రక్రియలో ఎంతోమంది యువతులకు నిరాశను మిగులుస్తున్న ఘటనలు కూడా లేకపోలేదు. ఎందుకంటే..ఈ సరోగసీ పరిశ్రమపై నియంత్రణ లేకపోవటమే. అవినీతి..దుర్వినియోగం వంటివి జరుగుతున్నాయి. దీంతో దీన్ని అంతర్జాతీయ ఆన్ లైన్ బేబీ స్టోర్ అని అంటున్నారు. ఎంతో మంది సరోగేట్ తల్లులు తమకు రావాల్సిన చెల్లింపులను పూర్తిగా పొందలేకపోతున్నారనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వారు పిల్లల్ని కనే ఫ్యాక్టరీలుగా మారతు అనారోగ్యాల పాలువుతున్న ఘటనలు విషాదాలుగా మిగులుతున్నాయి. వారి ఆరోగ్యాలు పాడైపోయాక వారిని పట్టించుకునేవారే ఉండరు. మరికొందరు సరోగసీ సమయంలో భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తున్నారు. అనారోగ్యాలపాలవుతున్నారు. పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారు.

తమ సర్రోగేట్ బిడ్డలను ఇంటికి తీసుకెళ్లడానికి ఉక్రెయిన్‌ను వచ్చిన బియాంకా విన్నీ స్మిత్ అనే బ్రిటిష్ దంపతులు మాట్లాడుతూ..ఫేస్‌బుక్ గ్రూపులో ఉక్రెయిన్‌లో అతిపెద్ద సర్రోగసీ సంస్థ గురించి విన్నామని తెలిపారు. అంటే ఉక్రెయిన్ లో సరోగసీ పరిశ్రమ ఎంతగా పెరిగిపోతోందో ఊహించుకోవచ్చు. ఇలా అమ్మ కడుపు బిడ్డల్ని కనే ఫ్యాక్టరీలుగా మారిపోతోంది. కన్నపేగుల్ని అమ్ముకునేలా మారిపోయింది.