ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన 110 ఏళ్ల బామ్మ

ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన 110 ఏళ్ల బామ్మ

110 year old singing sensation star : మీకు టాలెంట్ ఉందా? దాన్ని ఎవరూ గుర్తించటంలేదా? అయినా డోంట్ వర్రీ..సోషల్ మీడియా ఉండగా ఎందుకు మీకు బెంగ? టాలెంట్ ఉంటే మీరు ఓవర్ స్టార్ అయిపోవచ్చు..సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది తమ ప్రతిభను చాటుకుంటున్నారు. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతున్నారు. టాలెంట్కు వయస్సు అడ్డే రాదు. అలా ఒకే ఒక్క పాట పడి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు ఎమీ హాకిన్స్ అనే 110 ఏళ్ల బామ్మగారు..!!

ఒకే ఒక్కపాటతో ఈ బామ్మగారు ఓవర్‌ నైట్‌ స్టార్‌గా అయిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బాగా పాపులర్‌ అయిన ‘‘ఇట్స్‌ ఏ లాంగ్‌ వే టు టిప్పరరే’’ అనే పాటను ఎమీ పాడగా..ఆమె మనవరాలు దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఆ బామ్మగారి గాత్రానికి జనాలు ఫిదా అయిపోయారు. ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ అయిన 110 ఏళ్ల బామ్మ పాట ఎమీ హాకిన్స్‌ పేరు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. బామ్మగారి పాడిన ‘‘ఇట్స్‌ ఏ లాంగ్‌ వే టు టిప్పరరే’’ ఈ వీడియో సాంగ్‌ను లక్షమందికి పైగా చూశారు.

యూకేలోని వేల్స్‌నగరానికి చెందిన ఎమీ ఒకప్పుడు డ్యాన్స్‌ ట్రూప్‌లో డ్యాన్సర్ పనిచేసేవారు. డ్యాన్స్ ఎంత బాగా చేసినా ఆమెకు రాని గుర్తింపు ఆమె పాడిన ఒకే ఒక్క పాటకు వచ్చిన గుర్తింపు మామూలుగా లేదు. గత వారంలో ఎమీ బామ్మ పాడిన పాటకు జనాలు ఫిదా అయిపోయారు. ఆ గాత్రం విని మైమరిచిపోయారు. 110 వ ఏటలోకి అడుగుపెట్టిన బామ్మ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఎమీ లాంగ్‌ వేటు పాట పాడింది. దాన్ని ఆమె మనుమరాలు టిక్‌టాక్‌లో షేర్‌ చేయగా వ్యూస్‌ల వెల్లువ వచ్చింది. వైరల్ గా మారి దూసుకుపోతోంది.

 

వరల్డ్‌వార్‌–1 ముగిసే సమయానికి ఎమీ హాకిన్స్ కు 7 సంవత్సరాలు. 1911 కార్డిఫ్‌లో ఎమీ జన్మించినప్పటికీ తన చిన్నతనం మొత్తం న్యూపోర్ట్‌లో గడిచింది. ఎమీకి ఐదుగురు సోదరులతోపాటు ఒక సోదరి కూడా ఉన్నారు. ఆమె తన 14వ ఏట డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోగా..ఒక డ్యాన్స్ బృందంతో కలిసి పలు ప్రదర్శనలు ఇచ్చారు. కానీ ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు రాలేదు.కేవలం టీమ్ గా మాత్రమే వచ్చింది.


1937లో సైన్‌ రైటర్‌ జార్జ్‌ హాకిన్స్‌ను వివాహం చేసుకుని చాలా కాలం పాటు న్యూపోర్ట్‌లో ఉండేవారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఎమీ హాకిన్స్‌ ఫైర్‌ వాచర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఎమీ దక్షిణ వేల్స్‌లోని మోన్‌మౌత్‌షైర్‌లోని తన నివాసంలో నాలుగు తరాల వారసులతో కలిసి హ్యాపీ హ్యాపీ జీవిస్తున్నారు.

ఆమె 110వ బర్త్ డే సెలబ్రేషన్ లో బామ్మ పాడిన పాట ఇంత సంతోషాన్నిస్తుందనుకోలేదని ఆమె మనుమరాలు ఫ్రీమన్‌ తెలిపింది. బామ్మ పాటను టిక్‌టాక్‌లో షేర్‌ చేయలన్న నిర్ణయం ఇంతటి సంతోషాన్ని ఇస్తుందనుకోలేదనీ.. బామ్మకు సోషల్‌ మీడియా అంటే ఏంటో పెద్దగా తెలీదు. కానీ ఆమె ఒకపాటతో సింగింగ్‌ సెన్సేషన్‌గా నిలవడం మాకు చాలా హ్యీపీనిచ్చింది. ఇది ఆమెకు దక్కిన సూపర్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నామని ఫ్రీమన్‌ తెగ ఆనందపడిపోతూ చెప్పింది.