ఏం జరగబోతోంది : సెనేట్‌లో ట్రంప్ ‘అభిశంసన’ నెగ్గేనా?

  • Published By: sreehari ,Published On : December 19, 2019 / 08:46 AM IST
ఏం జరగబోతోంది : సెనేట్‌లో ట్రంప్ ‘అభిశంసన’ నెగ్గేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతినిధుల సభ (HoR)లో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. డెమెక్రటిక్స్ మెజార్టీ స్థాయిలో ఉన్న దిగువ సభలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అభిశంసన ఆమోదం పొందింది. అంతటితో అయిపోలేదు. సెనేట్ లో కూడా అభిశంసన ప్రక్రియలో ఆమోదం పొందాల్సి ఉంది.

రిపబ్లికన్స్ ఆధిపత్యం ఉన్న ఎగువ ప్రతినిధుల సభలో ట్రంప్ నెగ్గాలంటే కనీసం 216 ఓట్లు అవసరం ఉంది. అయితే ఈ సభలో డెమెక్రటిక్స్ 233 మంది సభ్యులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ అభిశంసన ప్రక్రియ నుంచి ఏ మేరకు గట్టెక్కగలరనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఎగువ సభలో కూడా అభిశంసన తీర్మానంలో నెగ్గలేని పక్షంలో ట్రంప్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవాల్సివస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

ట్రంప్ రాజీనామా చేస్తారా? :
ఇంకా లేదనే చెప్పాలి. ట్రంప్‌ను అభిశంసన చేసినందున సెనేట్ అభిశంసన విచారణను నిర్వహించాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఒకవేళ, విచారణ జరపడానికి సెనేట్ అంగీకరించినప్పటికీ, అతన్ని దోషిగా తేల్చడానికి కనీసం మూడింట రెండు వంతుల సభ్యులు ఓటు వేయాలి. ఇది కఠినంగా ఉంటుంది. ప్రతినిధుల సభలా కాకుండా, సెనేట్ రిపబ్లికన్ల ఆధిపత్యాన్ని కలిగి ఉంది.

విజయవంతమైన దోషారోపణ చేయాలంటే.. 53 మంది రిపబ్లికన్లలో కనీసం 20 మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలి. వారిలో 45 మంది డెమొక్రాట్లు, 2 మంది స్వతంత్రులు ఉండాలి. ఈ క్రమంలో వెస్ట్ వర్జీనియాకు చెందిన జో మంచీన్- III వంటి కొంతమంది డెమొక్రాట్లు ఇంతకుముందు పార్టీ శ్రేణులకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తుంది.

సెనేట్ విచారణ :
ట్రంప్ దోషిగా నిర్ధారించాలా? వద్దా అనేది నిర్ణయించడానికి, విచారణను నిర్వహించాలని సెనేట్ నిర్ణయించిన తర్వాత, అది విచారణ నియమాలను రూపొందించాలి. ఒక అధ్యక్షుడిని దోషిగా తేల్చడానికి అమెరికా రాజ్యాంగం సెనేట్ విచారణకు అవకాశం కల్పిస్తుంది. ఈ విషయంలో సాక్షులను పిలవాలా? లేదా సాక్షిగా పిలిచే అవకాశం ఉంది.

ఎలాంటి సాక్ష్యాలు ఆమోదించవచ్చు అనేది స్పష్టత ఉండాలి. సెనేట్ మెజారిటీ నేత, రిపబ్లికన్ మిచ్ మెక్ కన్నెల్, సెనేట్ మైనారిటీ నేత డెమొక్రాట్ చార్లెస్ ఈ- షుమెర్ మధ్య పరస్పర ఒప్పందం ద్వారా వీటిని నిర్ణయించాలి. దీనిపై విచారణ కోసం ఓ తేదీ కూడా కూడా నిర్ణయించడం జరుగుతుంది. బహుషా ఇది జనవరిలో ఉంటుందని అంతా భావిస్తున్నారు.

అసలు ప్రక్రియ ఇదే :
అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ జి రాబర్ట్స్ జూనియర్ ప్రిసైడింగ్ అధికారిగా పర్యవేక్షించబోయే ఈ విచారణ.. మొదట సెనేటర్లు నిష్పాక్షికత ప్రమాణం చేయించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సెనేట్ రాతపూర్వకంగా మాత్రమే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రాబర్ట్స్ ఆ విషయాన్ని అందరికి వినపడేలా గట్టిగా చదవాల్సి ఉంటుంది. రాబర్ట్స్, సెనేట్ మధ్య విచారణలో ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ విషయంలో విభేదాలు ఉంటే మాత్రం.. తరువాతి ప్రధాన న్యాయమూర్తి ఓవర్ రూల్ చేయవచ్చు.

న్యాయవిచారణ పాత్రను సభలోని డెమొక్రాట్లు పోషిస్తారు. వీరిని అభిశంసన మేనేజర్లు అని పిలుస్తారు. అయితే ట్రంప్ తన సొంత చట్టపరమైన రక్షణ బృందాన్ని నియమించుకునే అర్హత ఉన్నప్పటికీ శ్వేతసౌధం (వైట్ హౌస్) న్యాయ వాదులు ఆయన్ను సమర్థించే అవకాశం ఉంది. సెనేట్ ట్రయల్ వారానికి ఆరు రోజులు పని చేస్తుంది. కాకపోతే ఆ రోజంతా విచారణ జరుగుతున్న సమయంలో శాసనపరమైన మిగతా వ్యవహారాలకు అనుమతి ఉండదు.

బహిరంగ ఓటు- రహస్యంగా  :
విచారణ.. ఓటు బహిరంగంగా జరగాలి. అయినప్పటికీ సెనేట్ సభ్యులు ఉద్దేశపూర్వకంగా రహస్యాంగా కూడా జరపవచ్చు. ఒకరిపై నేరారోపణ కోసం జరిగే విచారణలో ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు ఆరోపణలలో కనీసం ఒకదానిపైనైనా దోషిగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్‌ను అడ్డుకోవడం వంటి ఆరోపణల్లో ఏ ఒక్కదానిపై ఓటు విజయవంతమైనా సరే.. ట్రంప్ రాజీనామాకు ప్రేరేపించే అవకాశం లేకపోలేదు.