Men serving Tea: ఆడాళ్లకు టీ సర్వ్ చేయడం.. మహిళలు పిజ్జా తినడం టీవీల్లో సెన్సార్

కొత్త ఇరానియన్ టీవీ సెన్సార్‌షిప్ ప్రకారం.. మహిళలు పిజ్జా తినడం, శాండ్ విచ్ లు తినడం వంటివి ప్రసారం చేయకూడదు.

Men serving Tea: ఆడాళ్లకు టీ సర్వ్ చేయడం.. మహిళలు పిజ్జా తినడం టీవీల్లో సెన్సార్

Tv Censorship Rules

Men serving Tea: కమర్షియల్ యాడ్ అంటేనే లేడీస్ ఉండాల్సిందే. మహిళలు పిజ్జా తినడం, కూల్ డ్రింక్ తాగడం వంటివి కమర్షియల్ యాడ్స్‌లో చూస్తూనే ఉంటాం. కొత్త ఇరానియన్ టీవీ సెన్సార్‌షిప్ ప్రకారం.. మహిళలు పిజ్జా తినడం, శాండ్ విచ్ లు తినడం వంటివి ప్రసారం చేయకూడదు.

ఇది మాత్రమే కాదు వర్క్ ప్లేసుల్లో మహిళలు రెడ్ కలర్ లో ఉన్న డ్రింక్స్ వంటివి తాగకూడదు. స్క్రీన్ ప్రజెంటేషన్ లో మహిళలు లెదర్ గ్లౌజులు కూడా ధరించకూడదు. ఇటువంటి కొత్త గైడ్ లైన్స్ ను బ్రాడ్‌కాస్టర్లకు, ఫిల్మ్ మేకర్స్ తప్పక పాటించాలని ఇష్యూ చేశారు అధికారులు.

మగాళ్లు, మహిళలు కలిసి ఉన్న ఫొటోగ్రాఫ్ లు, డొమెస్టిక్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్ కాస్టింగ్ ప్రసారానికి ముందే క్లియర్ చేసుకోవాలి. ఇరానియన్ హోం థియేటర్ లో చూడాలన్నా, స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలో వీక్షించాలన్నా లైసెన్స్ కచ్చితంగా ఉండాలి. టెహ్రాన్ లో కొన్ని స్ట్రీమింగ్ సైట్లు జరిమానాల నుంచి తప్పించుకోవాలని సెల్ఫ్ సెన్సార్ మొదలుపెట్టింది.

…………………………………….. : ఇలాంటి వారు తోడుంటే..నెట్టింట వీడియో వైరల్

పిష్గో అనే టాక్ షోలో ఎల్నాజ్ హబీబీ కెమెరా ముందు కనిపించకుండా కేవలం వాయీస్ మాత్రమే వినిపించడంతో ఈ సెన్సార్ రూల్స్ కు నాంది పడింది. వెటరన్ యాక్టర్ అమీన్ తరోఖ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు. ‘కనీసం ఆమె పేరైనా వేస్తారనుకుంటే అది కూడా లేదు. ఆర్టిస్ట్ మాట్లాడుతూ ఉంటే ఎవరా అని అనుకున్నాం. కేవలం వాయీస్ మాత్రమే వినిపించింది. ప్రోగ్రాం క్రియేటర్స్ అంత బాగా మేనేజ్ చేశారు. షో మొత్తం డిసెంట్ గా ఉందని’ అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు.