Work from home: వర్క్‌ ‌ఫ్రమ్‌ హోం వల్ల వచ్చే ఇబ్బందులేంటో చెప్పిన.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

రెండేళ్లకు ముందు ఉద్యోగులు తమ ఉద్యోగరిత్యా ఏ పనిచేయాలన్నా కార్యాలయాలకు రావాల్సిందే.. ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆప్షన్ ఉండేది కాదు. కానీ రెండేళ్ల క్రితం కరోనా వైరస్ రాకతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల విధుల్లో అనేక మార్పులు వచ్చాయి. ఐటీ కంపెనీల దగ్గర నుంచి...

Work from home: వర్క్‌ ‌ఫ్రమ్‌ హోం వల్ల వచ్చే ఇబ్బందులేంటో చెప్పిన.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Boris Johnson

Work from home: రెండేళ్లకు ముందు ఉద్యోగులు తమ ఉద్యోగరిత్యా ఏ పనిచేయాలన్నా కార్యాలయాలకు రావాల్సిందే.. ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆప్షన్ ఉండేది కాదు. కానీ రెండేళ్ల క్రితం కరోనా వైరస్ రాకతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల విధుల్లో అనేక మార్పులు వచ్చాయి. ఐటీ కంపెనీల దగ్గర నుంచి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే చిన్నాచితకా ఉద్యోగాలు ఏవైనా వర్క్ ఫ్రమ్ హోం విధానం సర్వసాధారణమైంది. పెద్దపెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకొనే అవకాశాన్ని కల్పించాయి. కొన్ని బడా కంపెనీలు పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోం అనేశాయి. ప్రస్తుతం కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోంకు అలవాటు పడిన అధికశాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

Work From Office : ఆఫీసుకు వచ్చి పనిచేయమన్న యాపిల్-రాజీనామా చేసిన డైరెక్టర్

ఇటీవల యాపిల్ సంస్థలో 76శాతం మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు కార్యాలయాలకు రావడానికి కూడా ఇష్టపడటం లేదని ఓ సర్వే వెల్లడించింది. తాజాగా ఇదే విషయమై కోడింగ్ నైపుణ్యాలు నేర్పించే వైట్ హ్యాట్ సంస్థలో కార్యాలయాలకు రావాలని మెయిల్స్ పంపినందుకు 800 మంది ఉద్యోగులు రాజీనామా చేశారని ఓ నివేదిక పేర్కొంది. పలు ఐటీ కంపెనీల ఉద్యోగులు సైతం కార్యాలయాలకు వచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తుండటంతో వారిని కార్యాలయాలకు రప్పించేలా సంస్థలు తంటాలు పడుతున్నాయి. మరోవైపు ట్విటర్ మాత్రం ఎప్పటికీ ఇంటి నుంచే పనిచేసేలా ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది. అయితే.. ఇప్పుడు ఆ సంస్థ యాజమాన్యం మారే అవకాశాలు కనిపిస్తుండటంతో ఆ విధానం అలాగే ఉంటుందా లేదా అన్నది వేచి చూడాలి. కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు అధికశాతం మంది ఉద్యోగులు విముఖత చూపుతున్న క్రమంలో.. వర్క్ ఫ్రమ్ హోం విధానంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Work from Home: ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు బంపర్ ఆఫర్లు

వర్క్ ఫ్రమ్ హోం వల్ల ఉద్యోగుల దృష్టి మరలుతుందని, ఈ విధానంతో నాకెదురైన అనుభవాన్ని బోరిస్ జాన్సన్ వివరించారు. ఇంటి నుంచి పని చేసేటప్పుడు మధ్యలో ఇంకో కాఫీ తెచ్చుకునేందుకు మనం ఎక్కువ సమయం వెచ్చిస్తామని, తర్వాత మళ్లీ తినుబండారాలు తెచ్చుకోవడానికి నడుచుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్తామని తెలిపారు. తిరిగి నిదానంగా నడుచుకుంటూ ల్యాప్ టాప్ వద్దకు వచ్చి కూర్చున్నాక.. మనం చేస్తోన్న పనేంటో కూడా గుర్తుండదని బోరిస్ తన అనుభవాన్ని తెలిపారు. అందుకే మళ్లీ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని, కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించడం ద్వారా చుట్టూ మనతోటి ఉద్యోగులు ఉంటారని తెలిపారు. చుట్టూ ఇతరులుంటే మన నుంచి ఉత్పాదకత ఎక్కువ వస్తుందని, మరింత ఉత్సాహంతో పాటు కొత్త కొత్త ఐడియాలతో పనిచేసే అవకాశం ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.