Work From Office : ఆఫీసుకు వచ్చి పనిచేయమన్న యాపిల్-రాజీనామా చేసిన డైరెక్టర్

రోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు.

Work From Office : ఆఫీసుకు వచ్చి పనిచేయమన్న యాపిల్-రాజీనామా చేసిన డైరెక్టర్

Apple Company

Work From Office :  కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు. కొన్ని సెక్టార్లలో మాత్రం ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరటంతో కొన్ని రంగాల వారు ఆఫీసులకు వెళుతున్నారు.  కానీ… ఎక్కువ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని  కొనసాగిస్తున్నాయి.

వర్క్ ఫ్రం హోం వెసులుబాటుకు అలవాటు పడిని  టెకీలు ఆఫీసులకువెళ్లి పని చేయాలంటే ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అందుకు వారు చెప్పే కారణాలు అనేకం ఉంటున్నాయి. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లాలంటే ఎక్కువ సమయం పట్టటం… ఉత్పాతదకత పడిపోవటం వంటి కారణాలు చెపుతున్నారు. కొన్ని కంపెనీలు ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందేనని పట్టుబట్టటంతో ఆ కొలువులకు రాజీనామా చేసి వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించే కంపెనీల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు.

న్యూయార్క్ లోని యాపిల్ కంపెనీ కూడా తన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు తీసేసి ఆఫీసుకు వచ్చిపని చేయమని కోరటం మొదలెట్టింది. దీంతో యాపిల్ మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్ ఇయాన్ గుడ్ ఫెలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను కంపెనీని వీడుతున్నట్లు ఇయాన్ తన టీం సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

పని విషయంలో మరింత వెసులుబాటు… తన  టీం కు మెరుగైన పాలసీ.. అంటూ సిబ్బందికి రాసిన నోట్ లో ఇయాన్ తెలిపాడు.  కంపెనీ నుంచి వైదొలగాలనే ఇయాన్ నిర్ణయం యాపిల్ హైబ్రిడ్ వర్క్ పాలసీపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
Also Read : Rains In Telangana : రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు
యాపిల్ ఇటీవల న్యూ వర్క్ పాలసీని అమలు చేస్తోంది. వారానికి ఒక్క రోజైనా ఆఫీసుకువచ్చి పని చేయాలని ఏప్రిల్ 11 నుంచి కోరుతోంది.  మే 2 నాటికి వారానికి రెండు రోజులు, మే 23 నాటికి కనీసం వారానికి 3 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని యాపిల్ ఉద్యోగులను ఆదేశించింది. ఈ పాలసీని కంపెనీకి చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.