World Oldest Man: “బాగా పనిచేయండి, సెలవుల్లో రెస్ట్ తీసుకోండి, ఆల్కహాల్ తాగండి.. ఎక్కువ కాలం బతకండి”

ప్రపంచంలోనే వృద్ధుడైన వెనెజులాకు చెందిన జాన్ విసెంటె పెరేజ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. 112ఏళ్ల వయస్సున్న ఆయన మరికొద్ది రోజుల్లో అంటే మే 27న 113వ బర్త్ డే జరుపుకోనున్నారు.

World Oldest Man: “బాగా పనిచేయండి, సెలవుల్లో రెస్ట్ తీసుకోండి, ఆల్కహాల్ తాగండి.. ఎక్కువ కాలం బతకండి”

World Oldest Man

World Oldest Man: ప్రపంచంలోనే వృద్ధుడైన వెనెజులాకు చెందిన జాన్ విసెంటె పెరేజ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. 112ఏళ్ల వయస్సున్న ఆయన మరికొద్ది రోజుల్లో అంటే మే 27న 113వ బర్త్ డే జరుపుకోనున్నారు. సుదీర్ఘ కాలం బతకగలిగిన ఆయన దాని వెనుక సీక్రెట్ గురించి చెప్తూ.. ఇలా అన్నారు.

“బాగా పనిచేయండి. సెలవు రోజుల్లో రెస్ట్ తీసుకోండి. త్వరగా పడుకోండి. రోజూ ఒక గ్లాస్ మద్యం తీసుకోండి. దేవుడ్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోండి” అంటున్నారు. మంచి ఆరోగ్యంతో ఏ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే ఆయన లైఫ్ లీడ్ చేస్తున్నట్లు ఆయన కూతురు నెలీడా పెరేజ్ చెబుతున్నారు.

1909లో పుట్టిన ఆయన ఎటిక్వియో డెల్ రొసారియో పెరేజ్ మోరా, ఎడెల్మిరా మోరాకు తొమ్మిదో సంతానం. జువాన్ 1937లో ఎడియోఫినా డెల్ రోసారియో గార్సియాను వివాహం చేసుకున్నాడు. అతనికి 11 మంది పిల్లలు, 41 మంది మనవరాళ్లు, 18 మునిమనవళ్లు, 12 మునిమనవరాళ్లు ఉన్నారు.

Read Also: డబ్బుల కోసం 90సార్లు వ్యాక్సిన్ వేసుకున్న 60 ఏళ్ల వృద్ధుడు

2019లో, అతను తన 110వ పుట్టినరోజును జరుపుకున్నాడు, వెనిజులాకు చెందిన మొదటి పురుష సూపర్ సెంటెనరియన్ అయ్యాడు.

స్పెయిన్‌కు చెందిన సాటర్నినో డి లా ఫ్యూంటె గార్సియా జనవరి 18, 2022న 112 సంవత్సరాల 341 రోజులకు మరణించిన తర్వాత జువాన్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు అనే బిరుదును అందుకున్నాడు.