Germany Vaccination: డబ్బుల కోసం 90సార్లు వ్యాక్సిన్ వేసుకున్న 60 ఏళ్ల వృద్ధుడు

జర్మనీలో 60 ఏళ్ల వృద్ధుడు డబ్బు సంపాదన కోసం వ్యాక్సినేషన్‌ను ఎంచుకున్నాడు. అదెలా అంటారా.. 60 ఏళ్ల వయసులో ఏకంగా 90 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. తూర్పు జర్మనీలోని ..

Germany Vaccination: డబ్బుల కోసం 90సార్లు వ్యాక్సిన్ వేసుకున్న 60 ఏళ్ల వృద్ధుడు

Covid Vaccine

Germany Vaccination: జర్మనీలో 60 ఏళ్ల వృద్ధుడు డబ్బు సంపాదన కోసం వ్యాక్సినేషన్‌ను ఎంచుకున్నాడు. అదెలా అంటారా.. 60 ఏళ్ల వయసులో ఏకంగా 90 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. తూర్పు జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరానికి చెందిన వ్యక్తి నకిలీ టీకా కార్డులను విక్రయించడానికి 90 డోసుల కొవిడ్ టీకాలు వేయించుకున్నట్లు తెలిసింది.

తూర్పు రాష్ట్రమైన సాక్సోనీలోని వ్యాక్సినేషన్ సెంటర్లలో జర్మన్ వృద్ధుడు 90 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలియడంతో జర్మనీ పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వ్యాక్సినేషన్ కార్డుల జారీ కోసం వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిసి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కోసం దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

పలు బ్రాండ్లకు చెందిన 90 రకాల వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తి ఆరోగ్యంపై టీకాల ప్రభావం ఎలా ఉందనే విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు.

Read Also: కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో సెలైన్ ఇంజెక్షన్ ఎక్కిస్తూ దొరికిపోయిన డాక్టర్

జర్మనీ దేశంలో బయట తిరిగే వ్యక్తులు టీకా తీసుకోవడం తప్పనిసరి. కొవిడ్ టీకాలు వేయించుకునేందుకు కొందరిలో ఇంకా భయం ఉండిపోవడంతో తమ పేర్లతో టీకాలు వేయించుకున్న వారి నుంచి సర్టిఫికేట్లు కొనుక్కుంటున్నారు.

తాజాగా శాక్సోనీ రాష్ట్రంలోని ఎలెన్ బర్గ్ కేంద్రానికి ఒక వ్యక్తి వరుసగా రెండో రోజు వచ్చి టీకా ఇవ్వాలని కోరాడు. సిబ్బంది ఆ వ్యక్తిని గుర్తించి ఆరా తీసేసరికి విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వగా.. ఎంక్వైరీ మొదలుపెట్టారు. పలు బ్రాండ్లకు చెందిన వ్యాక్సిన్లను మొత్తం 90 షాట్స్ తీసుకున్నట్టు వెల్లడించాడు.