Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో సెలైన్ ఇంజెక్షన్ ఎక్కిస్తూ దొరికిపోయిన డాక్టర్

కొవిడ్‌ను క్యాష్ చేసుకుందామనుకున్నాడు. వ్యాక్సిన్ పేరుతో వంచన చేయాలని ప్రయత్నించాడు. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవాలని వస్తే.. సైలెంట్‌గా

Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో సెలైన్ ఇంజెక్షన్ ఎక్కిస్తూ దొరికిపోయిన డాక్టర్

Covid Vaccine

Covid Vaccine: కొవిడ్‌ను క్యాష్ చేసుకుందామనుకున్నాడు. వ్యాక్సిన్ పేరుతో వంచన చేయాలని ప్రయత్నించాడు. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవాలని వస్తే.. సైలెంట్ గా సెలైన్ సొల్యూషన్ ఎక్కించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఇలా గతంలోనూ పలు మార్లు మోసానికి పాల్పడ్డట్లు విచారణలో తేలింది.

33ఏళ్ల సింగపూర్ డాక్టర్ కు యాంటి వ్యాక్సినేషన్ గ్రూప్‌తో సంబంధాలున్నాయని తెలుసుకుని విధుల్లో నుంచి తప్పించారు. కొవిడ్-19 వ్యాక్సిన్ కు బదులుగా సెలైన్ సొల్యూషన్ ఎక్కిస్తూ.. మినిష్ట్రీ ఆఫ్ హెల్త్స్ నేషనల్ ఇమ్యూనైజేషన్ రిజిస్ట్రీలో తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేసేవాడని తెలిసింది.

ఈ మేరకు మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిష్ట్రేషన్ పొందిన డా.జిప్సన్ క్వాను సింగపూర్ మెడికల్ కౌన్సిల్ మార్చి 23 నుంచి 18 నెలల పాటు సస్పెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లేదా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పూర్తయ్యేంత వరకూ విధుల్లోకి రాకూడదని పేర్కొంది.

Read Also: వృద్దులూ జాగ్రత్త.. కరోనా టీకా పేరుతో ఘరానా మోసం

విచారణలు కొనసాగుతున్నాయని, కేసును పరిశీలించేందుకు స్వతంత్ర ఫిర్యాదుల కమిటీని నియమించినట్లు మెడికల్ కౌన్సిల్ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ను మోసం చేసినందుకు గానూ డా. క్వా అసిస్టెంట్ థామ్ చువా చెంగ్ పైన కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. అతను వ్యాక్సినేషన్ పేరిట చేస్తున్న పనికి ఆ వ్యక్తి కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడం మానేస్తారు. ఇది దారుణమైన మోసమని సింగపూర్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది.