విద్యా సంవత్సరాన్ని జూన్ నుంచి ఆగస్టుకు మార్చాలని UGC సిఫార్సు

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 12:16 PM IST
విద్యా సంవత్సరాన్ని జూన్ నుంచి ఆగస్టుకు మార్చాలని UGC సిఫార్సు

విద్యా క్యాలెండర్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. అకడమిక్ క్యాలెండర్ పై UGC పలు కీలక సూచనలు చేసింది. అకడమిక్ ఇయర్ ను జూన్ నుంచి ఆగస్టుకు మార్చాలని సిఫార్సు చేసింది. ఆగస్టులో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించింది. అదే నెల ఒకటో తేదీ నుంచి క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించింది. తెలంగాణలో ఏప్రిల్ 23 తో అకడమిక్ ఇయర్ ముగిసినా ఇప్పటికీ పరీక్షలు పూర్తి కాలేదు. ఇంటర్ పరీక్షలు ముగిసినా ఇప్పటికీ వాల్యుయేషన్ ప్రారంభం కాలేదు. 10 వ తరగతికి సంబంధించి కేవలం మూడు పరీక్షలు మాత్రమే పూర్తయ్యాయి. 

కరోనా దెబ్బ అన్ని రంగాలపై పడింది. విద్యారంగంపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా విద్యా సంవత్సరం పూర్తిగా పొడిగింపు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23 న అకడమిక్ ఇయర్ పూర్తవుతుంది. జూన్ మొదటి వారంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అవుతాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో పరీక్షలన్నీ వాయిదా పడటంతో వీటిపై యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర మానవ వనరుల శాఖ వచ్చే అకడమిక్ ఇయర్ కు సంబంధించి రెండు కమిటీలు వేసింది. దానిపై యూజీసీ కీలక నిర్ణయం, సిఫార్సు లను కూడా చేసినట్లు తెలుస్తోంది. అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ను విడుదల చేసే క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? లాక్ డౌన్ ముగిసిన తర్వాత విద్యా సంవత్సరాన్ని ఎలా కొనసాగించాలి? అనే దానిపై చర్చించనున్నారు.