King Koti Palace : కబ్జా కోరల్లో కింగ్‌‌కోఠి.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

హైదరాబాద్‌ చారిత్రక కట్టడాల్లో ఒకటైన కింగ్‌కోటి ప్యాలెస్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. నిజాం రాజుల వారసత్వ సంపద రియల్ ఎస్టేటర్ల చేతిలో పడే ప్రమాదం కనిపిస్తోంది...

King Koti Palace : కబ్జా కోరల్లో కింగ్‌‌కోఠి.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

King Koti

Updated On : April 12, 2022 / 10:31 AM IST

King Koti Palace Land : హైదరాబాద్‌ చారిత్రక కట్టడాల్లో ఒకటైన కింగ్‌కోటి ప్యాలెస్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. నిజాం రాజుల వారసత్వ సంపద రియల్ ఎస్టేటర్ల చేతిలో పడే ప్రమాదం కనిపిస్తోంది. దాదాపు రూ. 200 కోట్ల విలువైన ఈ ప్యాలెస్‌లోకి చాలామంది ఒకేసారి అక్రమంగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. 40 మందిని అదుపులోకి తీసుకుని ట్రేస్ పాస్ కేసు నమోదు చేశారు.

Read More : Ideas2IT : 100 మంది ఉద్యోగులకు కార్లు గిఫ్ట్

ఈ ప్యాలెస్ పై సుఖేశ్ గుప్తా కన్ను పడినట్లు తెలుస్తోంది. అతనికి చెందిన మనుషులే అక్కడకు వెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. సుకేశ్ గుప్తా మనుషులు ప్యాలెస్‌లోకి రావడంతో వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే.. తమ ప్యాలెస్‌ను కొందరు అక్రమంగా ఆక్రమించాలని చూస్తున్నారని నిహారిక కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. తమ ప్యాలెస్‌లోకి ఎవరూ ఇన్వాల్వ్ కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. రూ. 200 కోట్ల విలువైన కింగ్‌కోఠి ప్యాలెస్ అమ్మకానికి ముంబైకి చెందిన నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీతో గత నెలలో ప్యాలెస్ ట్రస్ట్ సభ్యులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

Read More : Weekly 4 days: వారానికి 4 రోజులే పని..! కొత్త లేబర్ కోడ్

1911 సంవత్సరంలో నిజాం నవాబు ఇంకోటి ప్యాలెస్ నిర్మించాడు. నిజాం దగ్గర నుంచి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్యాలెస్ కొనుగోలు చేసింది. పూణేకు చెందిన నిహారిక కంపెనీ.. కశ్మీర్‌కు చెందిన ఐరిష్ కంపెనీ మధ్య వివాదం కొనసాగుతోంది. ఎలాంటి సంబంధం లేకుండా పాలెస్‌ను అక్రమించడానికి వచ్చారని నిహారిక కంపెనీ ఆరోపిస్తోంది. కింగ్‌కోఠి ప్యాలెస్ వివాదంపై 2022, ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.