ఈ ఏడాదిలో 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇవే!

ఈ ఏడాదిలో 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇవే!

8 Interesting Movies: 2020 తో ఆడియెన్స్‌కి డిజప్పాయింట్‌మెంట్ మిగిల్చిన సినిమా ఇండస్ట్రీ 2021 లో బాక్సాఫీస్ బిగ్ బొనాంజాతో రెడీ అయ్యింది. ఈ సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నా.. వాటిలో 8 సినిమాలు మాత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్. మరి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఆ 8 సినిమాలేంటో చూద్దామా.

ఈ ఇయర్ టాలీవుడ్‌లో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఓటీటీల్లో కొన్ని రిలీజ్ అవుతున్నా.. బిగ్ స్క్రీన్‌లో తప్పకుండా చూడాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీస్ 8. వాటిలో మార్చి 26 న రిలీజ్ అవుతున్న ‘అరణ్య’ కూడా ఉంది.

25 సంవత్సరాలు అడవిలో ఏనుగులతో ఉంటూ వైల్డ్ లైఫ్‌ని ప్రొటెక్ట్ చేస్తున్న ఓ వ్యక్తిని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని రానా దగ్గుబాటి లీడ్ రోల్‌లో నటించిన రియల్ ఇన్సిడెంటల్ మూవీగా రూపొందింది ‘అరణ్య’. రానా డిఫరెంట్ క్యారెక్టర్‌లో, ప్రభు సాల్మన్ డైరెక్షన్లో వస్తున్న‘అరణ్య’ తప్పకుండా చూడాల్సిన సినిమాగా చెబుతున్నారు ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ .

Aranya

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కూడా తప్పకుండా చూడాల్సిన సినిమాల్లో ఒకటిగా లిస్ట్ అవుట్ అయ్యింది. రామ్ చరణ్ సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా లీడ్ రోల్స్ చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాని ఇటు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్‌తో భారీ బడ్జెట్‌తో భారీ విజువల్ గ్రాండియర్‌తో రెండేళ్లుగా చెక్కుతున్నారు రాజమౌళి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ మోస్ట్ అవెయిటింగ్ మూవీని ఈ సంవత్సరం థియేటర్లలో చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్ .

RRR

2021 లో రాబోతున్న సినిమాలో ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. రెండేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవర్‌స్టార్ ఫుల్ ప్యాక్డ్ పర్ఫామెన్స్‌తో ఎర్లీ సమ్మర్‌లో ఎంట్రీ ఇవ్వడానికి అంతా రెడీ చేసుకుంటున్నారు. ఈ మూవీలో విమెన్ ఎమ్‌పవర్‌మెంట్ కోసం పోరాడే లాయర్‌గా సరికొత్తగా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. సినిమా ఎలాంటిదైనా.. పవన్‌కున్న క్రేజే వేరు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు పవన్ కళ్యాణ్‌ని కొత్తగా చూపించబోతున్న ‘వకీల్ సాబ్’ కోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ .

Vakeel Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్‌తో వస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా కూడా 2021 మోస్ట్ వెయిటింగ్ మూవీస్‌లో ఒకటి. పాన్ ఇండియా స్టార్‌గా అటు బాలీవుడ్‌లో కూడా అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న ప్రభాస్, బాలీవుడ్, టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న పూజా హెగ్డే ఇద్దరూ కలిసి చేస్తున్న రెట్రో లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. రెండేళ్లుగా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అందరూ.

Radhe Shyam

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీస్‌లో ఒకటి. ఎందుకంటే.. కొరటాల శివ డైరెక్షన్, దానికి తోడు చిరంజీవి పక్కన ఒక్క సీన్‌లో రామ్ చరణ్ కనిపిస్తే.. ఎగిరి గంతులేసే ఫ్యాన్స్‌కి.. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి సినిమాలో మేజర్ పార్ట్ చెయ్యడంతో ‘ఆచార్య’ కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా కోసం 20 ఎకరాల్లో టెంపుల్ సిటీ సెట్ వేసి రికార్డ్ క్రియేట్ చేసింది టీమ్. ఇన్ని స్పెషాలిటీస్ ఉండడంతో సమ్మర్‌లో రాబోతున్న ఈ సినిమా ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తోంది.

Acharya

సుకుమార్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాని 2021 దసరా టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈసారి విజయదశమికి బన్నీ డిఫరెంట్ స్టైల్లో విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకూ స్టైలిష్ స్టార్‌గా కనిపిస్తూ.. పెద్దగా మాస్ పాత్రల జోలికెళ్లని బన్నీ.. అటు లుక్ వైజ్‌గా ఇటు అప్పియరెన్స్ వైజ్‌గా కంప్లీట్‌‌గా చేంజ్ అయ్యి చేస్తున్న సినిమా ‘పుష్ప’. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కోసం క్రేజీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ .

Pushpa

రెండేళ్లనుంచి హిట్ లేకపోయినా.. టాలీవుడ్, బాలీవుడ్‌లో క్రేజీ ఇమేజ్ సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌తో చేస్తున్న సినిమా ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) మీద కూడా విపరీతంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ప్రొడక్షన్ పార్టనర్ కావడంతో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్ కోసం ఈగర్‌గా ఉన్నారు ఫ్యాన్స్. ఇంట్రస్టింగ్ కాంబినేషన్ పూరీ, విజయ్ కలిసి చేస్తున్న సినిమా అసలు ఎలా ఉండబోతోందో అని సినిమా స్టార్ట్ అయ్యినప్పటి నుంచే ఎవరి విజువల్ వాళ్లు వేసుకుంటున్నారు ఆడియెన్స్.

Puri Jagannadh - Vijay Deverakonda

స్టార్ హీరో కాకపోయినా, కమర్షియల్ కంటెంట్ లేకపోయినా 2021 లో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా లిస్ట్‌లో మేజర్ కూడా ఉంది. మహేష్ బాబు ప్రొడక్షన్‌లో అడవి శేష్ లీడ్ రోల్‌లో వస్తున్న ఈ సినిమా 2008 లో ముంబై ఎటాక్ టైమ్‌లో టెర్రరిస్టుల్ని ఎదుర్కొని చనిపోయిన సోల్జర్ ఉన్ని కృష్ణన్ స్టోరీని తీసుకుని తెరకెక్కిస్తున్నారు. శశి కిరణ్ తిక్కా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది. ఇలా 2021 లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. ఈ 8 సినిమాలు మాత్రం ఆడియెన్స్ అటెన్షన్‌ని గ్రాబ్ చేసే సినిమాలుగా క్రేజ్ సంపాదించుకున్నాయి.

Major